మేధావిగా గుర్తించటం మామూలే. కానీ.. తనను తాను మేధావిగా ప్రకటించుకోవటం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి వ్యక్తిగా చెప్పాలి ముఫ్తీ అయాజ్ అర్షద్ ఖుసామీ. జామియా మిల్లియా ఇస్లామియా.. డీయూ.. జేఎన్ యూతో సహా మూడు వర్సిటీల్లో పట్టభద్రుడైన ఆయన తనను తాను మేధావిగా చెప్పుకుంటారు. ఇప్పుడు హాట్ హాట్ గా నడుస్తున్న ట్రిఫుల్ తలాక్ బిల్లుపై జరిగిన టీవీ డిబేట్ లో అనూహ్యంగా వ్యవహరించారు.
తన తోటి ప్యానలిస్టు చేస్తున్న వాదనతో సహనం కోల్పోయిన ఆయన.. ఫరా ఫైజ్ పై విచక్షణారహితంగా దాడికి దిగారు. అప్పటివరకూ హాట్ హాట్ గా సాగుతున్న చర్చను పక్కదారి పట్టిస్తూ.. సీరియస్ గా లేచిన ఆయన ఫరాపై దాడికి దిగారు. దీంతో.. అసలేం జరుగుతుందో కొద్ది క్షణాలు అర్థం కాని పరిస్థితి.
ఊహించని ఘటనతో షాక్ తిన్న టీవీ ఛానల్ సిబ్బంది కలుగజేసుకొని విడదీసే సమయానికే మహిళా ఫ్యానలిస్ట్ పై ముష్టిఘాతాలు కురిపించారు. విచక్షణారహితంగా సాగిన ఈ దాడి నుంచి ఆమెను కాపాడేందుకు టీవీ ఛానల్ సిబ్బంది తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఉదంతం ప్రేక్షకుల్ని తీవ్ర విస్మయానికి గురి చేసింది.
ప్రముఖ జాతీయ ఛానల్లో చోటు చేసుకున్న ఈ డిబేట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్ వేసిన ఫరా ఫైజ్ ఈ చర్చలో పాల్గొన్నారు. ఇరువురి మధ్య చర్చ జోరుగా సాగుతున్న సమయంలోనే తిట్ట దండకం అందుకున్న ఆయన.. అనంతరం దాడికి దిగారు.
దీంతో అప్రమత్తమైన ఛానల్ సిబ్బంది ఆయన్ను బలవంతంగా విడదీసి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు స్టూడియోకి వచ్చి అర్షద్ ఖసామీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తాలూకు వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. సీసీ కెమేరాలు.. డ్యాన్స్.. సంగీతం లాంటి వాటిపై తరచూ ఫత్వాలు జారీ చేసే ఆయన.. ట్రిఫుల్ తలాక్ మంచిదని బలంగా వాదిస్తుంటారు. వాదనతో అవతల వారి మీద అధిక్యత ప్రదర్శించాల్సిన పెద్ద మనిషిగా టీవీ డిబేట్ లో కూర్చొని మరీ ప్యానలిస్టు మీద దాడి చేయటం ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Full View