మ్యాక్స్‌వెల్.. ఏందయ్యా ఇదీ.. 10 కోట్లు పెట్టి కొంటే.. ఇట్లనా నువ్వు ఆడేది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే మెరుపు షాట్లు, భారీ షాట్లు, జట్టును మలుపుతిప్పే ఆటగాళ్లు. అటువంటి ఆటగాళ్లలో మ్యాక్స్‌వెల్ ఒకడు. కానీ ఈ సీజన్‌లో మాత్రం మ్యాక్స్ వెల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ ఆసక్తికరంగా ఉంటుంది. అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే ఎంతటి బౌలర్ అయినా భయపడతాడు. కానీ అటువంటి మ్యాక్స్‌వెల్ ఈ సారి తేలిపోయాడు. ఈ సారి అతను అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఆదివారం రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యాడు. చాహర్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ఐపీఎల్ లో మొత్తం అన్నింట్లోకి కలిపి మ్యాక్స్‌వెల్ ఇప్పటిదాకా పదిసార్లు డకౌట్ అయ్యాడు.
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఎనిమిది మ్యాచ్‌లను ఆడిన అతను.. ఏ ఒక్క దాంట్లో కూడా రాణించలేకపోయాడు. 1, 5, 13 (నాటౌట్),11,11, 7,10 (నాటౌట్), 0.. ఇదీ అతని స్కోర్. ఇప్పటికే సగం టోర్నీ పూర్తయింది. రూ. 10.75 కోట్ల రూపాయలను పంజాబ్ ఫ్రాంఛైజీ అతనిపై పెట్టుబడి పెట్టింది. కానీ అతడు మాత్రం పేలవప్రదర్శన ఇస్తున్నాడు.. మ్యాక్స్‌వెల్ సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్‌నే.. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడు. ఆస్ట్రేలియా తరఫున బ్యాటింగ్, బౌలింగ్‌లో మ్యాజిక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐపీఎల్లో మాత్రం తేలిపోతున్నాడు. 2017 సీజన్‌లో మాత్రమే అత్యధికంగా 310 పరుగుల స్కోర్ సాధించాడు.