మ్యాక్స్​ వెల్​ ఇది నువ్వేనా? ఏమైంది.. అసలు..

Update: 2020-10-25 15:00 GMT
ఈ ఐపీఎల్​ సీజన్​లో కింగ్స్​ ఎలెవన్​ టీం బ్యాట్స్​మెన్​ మ్యాక్స్​వెల్​.. తన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాడు.  ఈ సీజన్​లో అత్యంత దారుణంగా విఫలమైన వాళ్లలో మ్యాక్స్​వెల్​ ఒకడు. ఒకప్పుడు మ్యాక్స్​వెల్​ క్రీజ్​లో ఉన్నాడంటే.. బౌలర్లు, ఫీల్డర్​లలో గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. స్కోర్​ బోర్డు పరుగులు పెట్టేది. సిక్సర్లు, ఫోర్లతో మోత మోగేది. కానీ ఈ సారి మాత్రం చాలా పేలవమైన ప్రదర్శన ఇస్తున్నాడు మ్యాక్స్​వెల్​. ఈ ఐపీఎల్​లో మొత్తం 10 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్‌ వంద బంతులను ఎదుర్కొన్నాడు. చేసిన పరుగులు 102. నిన్నటి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లో  13 బంతులాడి 12 పరుగులు చేశాడు.  దాంతో ఓవరాల్‌గా ఈ సీజన్‌లో వంద బంతుల్ని ఎదుర్కోవడంతో పాటు వంద పరుగుల్ని కూడా కష్టపడి పూర్తి చేసుకున్నాడు.

పించ్‌ హిట్టర్లలో ఒకడైన మ్యాక్సీ 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక సిక్స్‌ కూడా లేకపోవడం గమనార్హం.ఒక జట్టు ఎంతో నమ్మకంతో వరుసపెట్టి అవకాశాలు ఇస్తుంటే అతడు   ఇలా పేలవ ప్రదర్శనతో పంజాబ్‌ పరాజయాల్లో భాగమవుతున్నాడు. ఎవరైనా విజయాల్లో భాగమైతే అతనిపై ఆయా జట్లు కూడా నమ్మకం ఉంచుతాయి. మరి మ్యాక్సీ విఫలం కావడం అతని అంతర్జాతీయ కెరీర్‌పైనే కాకుండా లీగ్‌ల్లో కూడా ప్రభావం చూపడం ఖాయం.

‘మ్యాక్స్​వెల్​కు ఏమైంది.. ఆసలు ఆడుతుంది తనేనా.. లేక ఏమన్నా ఆత్మ ఆవహించిందా’ అంటూ సోషల్​మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
Tags:    

Similar News