గుర్తుకొస్తున్నాయి.. ఇంత చేసి ప‌వ‌న్‌ సాధించేందేంటి..?

Update: 2022-08-28 03:30 GMT
అవును... ఇప్పుడు జ‌న‌సేన‌లో పాత సంగ‌తులు గుర్తుకు వ‌స్తున్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహంలో భాగంగా ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్నిసీట్ల‌ను బీఎస్పీ కి ఇచ్చారు. అస‌లు బీఎస్పీ అంటే ఏమిటో కూడా ఏపీ వారికి తెలియ‌దు. అయినా.. కూడా యూపీ నుంచి ప్ర‌త్యేక విమానంలో త‌న సొంత ఖ‌ర్చుతో బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని తీసుకువ‌చ్చి మ‌రీ.. ఏపీలో హ‌డావుడి చేశారు.

ఆమెకు బహిరంగ స‌భా వేదిక‌ల‌పైనే ఆయ‌న పాద న‌మ‌స్కారాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును వైసీపీకి ప‌డ‌కుండా.. చేయాల‌నే ప్ర‌త్యేక వ్యూహంలో భాగంగానే ప‌వ‌న్ ఈ విధంగా చేశార‌నే టాక్ అప్ప‌ట్లో వినిపించింది.

వాస్త‌వానికి అప్ప‌టికి వైసీపీకి ఉన్న బ‌లం ఎస్సీ, ఎస్టీలే.. 2014లోనూ ఆయా రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి కాంగ్రెస్ ఓటు బ్యాంకుక‌లిసి వ‌చ్చి.. బ‌లం పెరిగింది. దీనిని ఎలాగైనా త‌ప్పించాల‌నేది జ‌న‌సేన వ్యూహం.

ఈ క్ర‌మంలోనే మాయావ‌తికి ప‌వ‌న్ వంగి వంగి ద‌ణ్ణాలు పెట్టారు. కానీ.. అప్ప‌ట్లో ఫ‌లితం రాలేదు. ఒక్క రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో త‌ప్ప‌.. ఎక్క‌డా గెలిచిన ప‌రిస్థితి లేదు. క‌ట్ చేస్తే.. ఆ క‌ష్టం తాలూకు ఫ‌లితం.. ఈ మూడేళ్ల‌లో ఏమైనా క‌నిపించిందా?  జ‌న‌సేన ఏమైనా.. ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును కానీ.. ఆ వ‌ర్గాన్ని కానీ.. త‌న‌వైపు తిప్పుకొందా ? అనేది ప్ర‌శ్న‌. అయితే.. దీనికి ఆ పార్టీ నాయ‌కులే స‌మాధానం చెప‌పుకోలేక పోతున్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అనేది ఆలోచ‌న‌.

ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఒక‌రిద్ద‌రు.. సాక్షాత్తూ.. ప‌వ‌న్‌కు ఈ ఫొటోలు చూపించి.. ఇంత చేసినా.. ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు మ‌న‌కు అనుకూలంగా లేద‌ని చెప్పార‌ట‌. అయితే.. దీనిపై ఆలోచ‌న చేయాల్సిన ప‌వ‌న్‌.. అలా చేయ‌డం మానేసి.. మీరు కోవ‌ర్టులు అంటూ.. ఎదురు విమ‌ర్శ‌లు సంధించిన‌ట్టు నాయ‌కులు.. అంత‌ర్గ‌త స‌మావేశాల్లో.. గుస‌గుస‌లాడుతున్నారు. మ‌రి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా.. ఎస్సీ, ఎస్టీల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు.. పాత సంగ‌తుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తారో.. లేదో.. చూడాలి.
Tags:    

Similar News