ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతోనే ఢిల్లీలో సమీకరణాలు మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన వాళ్లు ఒక్కొక్కరుగా కామ్ అయిపోతూ ఉన్నారు. కేంద్రంలో మళ్లీ కమల వికాసమే అని ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవంగా తేల్చి చెప్పాయి. బీజేపీ వాళ్లు గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా ఇప్పుడు ఎక్కువ ఎంపీ సీట్లను సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి.
కమలం పార్టీ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశం ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెబితే - మరి కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు.. బీజేపీ కూటమికి ఏకంగా మూడు వందల అరవై ఎంపీ సీట్లు దక్కుతాయని తేల్చాయి. ఇండియాటుడే వంటి ప్రముఖ వార్తా సంస్థ అలాంటి ఎగ్జిట్ పోల్ ను ఇవ్వడం సంచలనం రేపుతూ ఉంది.
అవే ఫలితాలు వస్తే గనుక మోడీకి తిరుగులేనట్టే. అందుకే అప్పుడే కొంతమంది కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఫలితాల వెల్లడి రోజున ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నారు. ఆ సమావేశానికి ఇప్పటికే ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. నిన్న మొన్నటి వరకూ ఆ కూటమిలో క్రియాశీల పాత్ర పోషిస్తాయనుకున్న పార్టీలే ఇప్పుడు మొహం చాటేస్తూ ఉన్నాయని సమాచారం.
ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజు బీఎస్పీ అధినేత్రి మాయవతి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఆయన తల్లి సోనియాగాంధీని కలవాల్సింది. అయితే ఆమె అనూహ్యంగా ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవడం ఆసక్తిదాయకంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి మాయవతి మొత్తం రాజకీయ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చారని.. అందుకే ఆమె కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి.
నిన్న కూడా చంద్రబాబు నాయుడు వెళ్లి మాయావతితో సమావేశం అయ్యారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ‘పెద్దన్న’ పాత్ర పోషించాలని అంటూ ఆమె చంద్రబాబును కోరినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వాళ్లతో సమావేశాన్నే రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఢిల్లీలో సమీకరణాలు మారుతున్నాయనే ప్రచారానికి మాయవతే తీరే నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు.