ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బాహుబలులు, మాఫియా, గ్యాంగ్ స్టర్లకు నో టికెట్లని బీఎస్పీ అధినేత్రి మాయావతి తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలోగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఇప్పటినుండే వివిధ పార్టీలు పొత్తులు, టికెట్ల విషయంలో బాగా వేడిరాజుకుంది. యూపీలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు కానీ ప్రతి పార్టీలోను కావాల్సినంతమంది నేరచరితులున్నారు. గ్యాంగ్ వార్ కు, కులాల కుంపట్లకు పెట్టింది పేరైన ఉత్తరాధి రాష్ట్రాల్లో యూపీ కూడా కీలకమైందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పటి అసెంబ్లీలో చాలామంది ఎంఎల్ఏల మీద చాలా కేసులున్నాయి. వీరిలో కొందరు జైల్లో కూర్చునే ఎంఎల్ఏలుగా గెలిస్తే, మరికొందరు గెలిచిన ఎంఎల్ఏలు వివిధ కేసుల్లో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇలాంటి వారిని మామూలు జనాలు ఏవగించుకుంటున్నా చేసేదిలేక వాళ్ళల్లోనే ఎవరో ఒకరికి ఓట్లు వేయాల్సుంటుంది. ఇలాంటి పరిస్థితులు బాగా పెరిగిపోయిన విషయాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి గమనించినట్లున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల్లో క్లీన్ చిట్ ఉన్నవారినే ఎంపిక చేయబోతున్నట్లు ప్రకటించారు.
గ్యాంగ్ స్టర్లు, బాహుబలులు, మాఫియా డాన్లకు తమ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఇచ్చేది లేదని స్పష్టంగా ప్రకటించారు. మవూ అసెంబ్లీ స్థానం నుండి భీం రాజ్ బర్ ను పోటీలో దింపనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంఎల్ఏ ముక్తార్ అన్సారీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన పెద్ద గ్యాంగ్ స్టర్ గా పేరున్న వ్యక్తి. ప్రస్తుం జైల్లో ఉన్నారు. ఈయన ఎంతటి ఘనుడంటే యూపీతో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా కలిపి 52 కేసులున్నాయి.
ప్రస్తుతం ఈయనపై 15 కేసుల్లో విచారణ వివిధ దశల్లో ఉంది. ఓ కేసులో చాలాకాలంగా జైల్లోనే ఉన్నారు. అయినా వచ్చే ఎన్నికల్లో పోటీకి మళ్ళీ రెడీ అయిపోతున్నారు. ఇదే విషయాన్ని మాయావతి ప్రస్తావిస్తూ క్లీన్ చిట్ ఉన్నవారే టికెట్లంటు ప్రకటించింది. అయితే ఓ చిన్న సందేహం ఏమిటంటే మాయావతి చెబుతున్నట్లు నూరుశాతం క్లీన్ చిట్ ఉన్నవాళ్ళు బీఎస్పీ అభ్యర్ధులుగా దొరుకుతారా ? చూడాలి. ఎందుకంటే మామూలు జనాలెవరు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ పోటీ చేసినా ప్రత్యర్ధుల ధాటిని తట్టుకోలేరు.
విచిత్రమేమిటంటే మాయావతి మీదే అనేక అవినీతి కేసులుండేవి. కొన్ని కేసుల్లో జైలు జీవితాన్ని గడిపిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఆమెపై ఎన్ని కేసులున్నాయో ? ఎన్నింటిపై విచారణ జరుగుతోందో ? ఎన్నింటిని కొట్టేశారో కూడా జనాలకు క్లారిటీ లేదు. ధైర్జన్యాలు, అవినీతి కేసులున్న మాయావతి కూడా క్లీన్ చిట్ ఉన్నవారికే టికెట్లని చెబుతుండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.