పవన్‌ కోసం ఏపీకి మాయావతి

Update: 2019-04-01 16:26 GMT
విమర్శలు వస్తూనే ఉంటాయి కానీ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న పవన్‌.. తన ప్రచారానికి మద్దతుగా బీఎస్పీ అధినేత మాయావతిని రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్‌ - మమతాబెనర్జీ - ఫరూక్‌ అబ్దుల్లా లాంటి నేతల్ని చంద్రబాబు రంగంలోగి దించితే.. తానేం తక్కువ అన్న చందాన మాయావతిని ఏపీకి తీసుకువస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌.

ఏపీ ఎన్నికల్లో భాగంగా మాయావతికి చెందిన బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంది పవన్‌ కల్యాణ్‌. వాళ్లు అడిగారో లేదో తెలీదు కానీ.. దాదాపు ఆ పార్టీకి 27 సీట్ల వరకు ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయావతి ఈనెల 2న రాష్ట్రానికి రానున్నారు. ఏప్రిల్ 3న విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడలోని భారీ బహిరంగ ఉంటుంది. ఆ తర్వాతి రోజు తిరుపతిలో భారీ బహిరంగ సభ ఉంది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌ లోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సభలు అయితే భారీగానే ఏర్పాటు చేశారు కానీ.. ఏపీ ఎన్నికల్లో మాయావతి ప్రభావం ఎంతమేర ఉంటుంది అనేది మాత్రం ప్రశ్నార్థకమే.
Tags:    

Similar News