ఎర్ర బస్సు అంటే బడా జనాలు చిన్న చూపు. అది పేదల బడుగుల అతి సాధారణ వాహనం అని భావిస్తారు. అయితే మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాత్రం సడెన్ గా ఎర్ర బస్సు ఎక్కేశారు. ఎయిర్ బస్సెక్కే మేయర్ ఇలా ఎర్ర బస్సులో తమ పక్కన కూర్చుంటే సాటి ప్రయాణీకులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఇక టికెట్ కొట్టాల్సిన కండక్టర్ అలా చూస్తూండిపోయారు. అయితే మేయర్ మాత్రం కార్పోరేషన్ స్టాప్ దగ్గర బస్ ఆపమంటూ టికెట్ తీసుకున్నారు. ఇంతకీ మేయర్ ఎందుకిలా చేశారు అంటే ఆమె కార్పోరేషన్ లో ఒక వినూత్న విధానాన్ని తాజాగా తీసుకువచ్చారు.
ప్రతీ సోమవారం యావత్తు కార్పోరేషన్ సిబ్బంది పాలకవర్గం అంతా కూడా సొంత వాహనాలు వినియోగించకుండా కార్యాలయానికి ప్రజా రవాణా ద్వారానే రావాలని ఆదేశించారు. దాన్ని పాటించడంలో భాగంగా తాను కూడా ఎర్ర బస్సు ఎక్కి తన ఇంటి నుంచి కార్పోరేషన్ చేరుకున్నారు.
ఒక వైపు వాన కురుస్తున్నా మేయర్ బస్సు కోసం వేచి చూసి ఎక్కడంతో ఆమె చిత్తశుద్ధిని చూసి స్థానికులు మెచ్చుకుంటున్నారు. పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేసిన మేయర్ పాఠాలు చెప్పడంలోనూ దిట్ట.
ప్రజలకు ఏది మంచి ఏది చెడు అన్నది వివరిస్తూ చైతన్యం కలిగించడం ద్వారా ఆమె తనలోని ప్రజానాయకురాలిని ఎప్పటికపుడు బయటకు తెస్తారు. ఏణ్ణర్ధం క్రితం జరిగిన విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో మహిళను మేయర్ చేయడం ద్వారా జగన్ అవకాశం ఇస్తే మహిళలు మహరాణులు మగవారికి ఎక్కడా తీసిపోరు అంటూ విశాఖ మేయర్ రుజువు చేసుకుంటున్నారు.