బక్రీద్ కి అలా చేస్తే కేసులేనంట

Update: 2015-09-13 04:21 GMT
బక్రీద్ సందర్భంగా గోవధకు పాల్పడితే కేసులు తప్పవన్న హెచ్చరికలు చేస్తున్నారు మెదక్ జిల్లా ఎస్పీ సుమతి. అంతేకాదు.. గోవధకు పాల్పడే వారి సమాచారం అందిస్తే.. వారిపై కేసులు పెడతామని.. గోవుల్ని అక్రమంగా తరలిస్తే ఊరుకునేది లేదంటున్నారు.

గోవధ లేకుండానే బక్రీద్ జరుపుకోవాలని సూచిస్తున్నారు. గోవుల్ని అక్రమంగా తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు చెబుతున్నారు. గోవధను అడ్డుకునేందుకు.. ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాల్ని ఏర్పాటు చేయటంతో పాటు.. గస్తీ మరింత పెంచనున్నట్లు పేర్కొన్నారు.

బక్రీద్ సందర్భంగా గోవుల్ని వధించే అలవాటున్న నేపథ్యంలో.. తాజా హెచ్చరికలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మెదక్ జిల్లా ఎస్పీ మాదిరే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన జిల్లాల ఎస్పీలు కూడా వ్యవహరిస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మరి..దీనికి బదులిచ్చేవారెవరు..?
Tags:    

Similar News