టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొడుతున్నారు. అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ దేశానికి పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు పతకాలను సాధించారు. నిన్న వరుస పతకాలతో దుమ్మురేపి ఒకే రోజు మూడు పతకాలు అందించారు. తాజాగా, నేడు నాలుగు పథకాలతో భారత్ జెండా ను రెపరెపలాడిస్తున్నారు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్ లో భారత క్రీడాకారిణి అవని లేఖర 249.6 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫలితంగా డిసెంబరు 2018లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఇరీనా షెట్నిక్ నమోదు చేసిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. టోక్యోలో భారత్ కు ఇదే తొలి పతకం కాగా, పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా అవని రికార్డులకెక్కింది. మొత్తంగా స్వర్ణం సాధించిన ఐదో మహిళగా చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్ 2020లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖారాపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరడమే కాకుండా.. పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా 19 ఏళ్ల అవని రికార్డు సృష్టించింది. డిస్కస్ త్రోలో యోగేశ్ కతునియా పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 56లో రజత పతకం అందించాడు. 44.38 మీటర్లు విసిరి ఈ సీజన్ లోనే బెస్ట్ సాధించాడు. 24 ఏళ్ల యోగేశ్ ఈ కేటగిరీలో ప్రపంచ నంబర్ 2గా కొనసాగుతున్నాడు. బ్రెజిల్ క్రీడాకారుడు క్లాడినే బటిస్టా 45.59 మీటర్లు విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అలాగే, జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి.

దేవేంద్ర జజారియా రజత పతకం గెలుచుకోగా, సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో పారాలింపిక్స్ లో భారత్‌కు ఆరు పతకాలు సొంతమయ్యాయి. ఆదివారం ఒకే రోజు మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఉదయం టేబుల్ టెన్నిస్ లో భవీనా పటేల్ రజత పతకం సాధించగా, మధ్యాహ్నం హైజంప్ లో నిషాద్ కుమార్ రజతం సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించి రికార్డు పుస్తకాల్లో తన పేరు లిఖించుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో ఫైనల్‌లో వినోద్ కుమార్ 19.91 మీటర్ల దూరం విసిరి ఆసియా రికార్డును బద్దలుగొట్టాడు.
పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 62 కేటగిరీలో ఇండియన్ అథ్లెట్ సుమిత్ అంటిల్ 68.55 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్ లో తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డు సృష్టించాడు. అయితే 5వ ప్రయత్నంలో ఏకంగా 68.55 మీటర్ల దూరం విసిరి తన వరల్డ్ రికార్డును మరోసారి సవరించాడు.