ఒక ముఖ్యమంత్రికి.. ఆయన సోదరికి మధ్య రాజకీయ విభేదాల గురించి తాటికాయంత అక్షరాలతో బ్యానర్లు రాస్తూ.. బిగ్ బ్రేకింగ్ అంటూ హడావుడి చేసిన మీడియా.. మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన కుమార్తెకు మధ్య నెలకొన్న విభేదాల(?) గురించి మాట వరుసకు ప్రస్తావించరెందుకు? అన్న ప్రశ్నను పలువురు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించే మీడియా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో మాత్రం అస్సలు పట్టనట్లుగా.. ఆ మాటకు వస్తే.. అసలేం జరగనట్లుగా ఎందుకు ఉంటారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో తరచూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయినప్పటికీ ఈ విషయం మీద మీడియాలో ఎక్కడా ఎలాంటి వార్త కనిపించలేదన్నమాట వినిపిస్తూ ఉంటుంది.
రాఖీ పౌర్ణమి రోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన సోదరి షర్మిల రాఖీ కడతారా? లేదా? అంటూ భారీ ఊహాగానాలతో పాటు.. ఏం జరుగుతుందన్న దానిపై క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. మరి.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి అయిన ఆయనకు సోదరి కమ్ ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టకపోవటం గురించి ఎందుకు ప్రస్తావించలేదన్న మాట వినిపిస్తోంది. అయితే..కొందరు చెప్పినట్లుగా ఇద్దరి మధ్య విభేదాలు లేవని.. వ్యక్తిగత కారణాలతో ఆమె విదేశాలకు వెళ్లినట్లు చెబుతున్నారు. మరి.. అదే విషయాన్ని అయినా మీడియా ఎందుకు ప్రస్తావించటం లేదన్న మాటను అడిగితే.. ఎవరి వద్దా సమాధానం లేని పరిస్థితి.
రక్షాబంధన్ కు ప్లాన్ చేసుకోలేదనే అనుకుందాం. లేదంటే.. అనుకోని రీతిలో తిరిగి రావటం సాధ్యం కాలేదని భావిద్దాం. మరి.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమానికైనా ఆమె హాజరు కావాలి కదా? మరెందుకు కనిపించలేదు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమం హడావుడిగా.. అప్పటికప్పుడు పెట్టిన ముహుర్తంఏమీ కాదు.
చాలాముందే అనుకున్నది. అలాంటప్పుడు అంతటి ముఖ్యమైన కార్యక్రమానికి కేసీఆర్ కుమార్తె ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. ఆ మాటకు వస్తే.. కొంతమంది టీఆర్ఎస్ నేతలు.. నిజమే కదా? నేను గమనించలేదని వ్యాఖ్యానించటం గమనార్హం. ఎందుకిలా? అన్న ప్రశ్నకు గులాబీ నేతలు ఎవరూ సమాధానం చెప్పట్లేదు సరే.. మరి ప్రదాన మీడియా కూడా ఎందుకు మౌనంగా ఉన్నట్లు చెప్మా?