జోరుగా ప్రయాణం సాగుతున్న వేళ.. అనుకోని స్పీడ్ బ్రేక్ ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది? మూర్తీభవించిన ఆత్మవిశ్వాసంతో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఊహించని అనుభవాన్ని మిగిల్చింది డీఎంకే అధినేత స్టాలిన్ తో సమావేశం. సీఎం కేసీఆర్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా? తనకు అవసరమైతే ఎంతకైనా తగ్గేందుకు వెనుకాడని ఆయన.. ఒకసారి పట్టు చిక్కిన తర్వాత ఎంతలా చుక్కలు చూపిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు.
తన అపాయింట్ మెంట్ కోసం ప్రముఖులకు సైతం చుక్కలు చూపించే కేసీఆర్‌కు దాదాపు అలాంటి అనుభవాన్నే మిగిల్చారు డీఎంకే అధినేత. తాను భేటీ అవుతానన్న మాటకు బదులు రాని వేళ.. తమిళనాడు నుంచి తెలంగాణకు వచ్చేసిన గులాబీ బాస్.. మళ్లీ వెంటనే బయలుదేరటం ఆసక్తికరంగా మారింది.
ఇంత కష్టపడిన దానికి ఫలితం ఎలా ఉందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గంట పాటు సాగిన సారు.. స్టాలిన్ భేటీపై డీఎంకే స్పందిస్తూ.. మర్యాదపూర్వక భేటీగా ముక్తసరి ప్రకటన చేయటం ద్వారా.. కేసీఆర్ బాటలో తాను నడవనన్న విషయాన్ని తేల్చేసినట్లుగా చెప్పాలి. ఇరువురు అగ్రనేతల భేటీ అనంతరం.. మీడియాతో ఉమ్మడి ప్రకటన ఉంటుందన్న దానికి భిన్న పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీటింగ్ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడింది లేదు.
ఈ నేపథ్యంలో వివిధ మీడియా సంస్థలు తమకున్న సోర్సు ద్వారా.. ఇద్దరు అగ్రనేతల మీటింగ్ సారాంశం ఏమిటన్న అంశంపై దృష్టి పెట్టారు. దీనికి సంబంధించిన తాము సేకరించిన సమాచారాన్ని తమ పాఠకులకు అందజేశారు. అదే సమయంలో డీఎంకే కూడా సోషల్ మీడియాలో సమావేవం మీద స్పందిస్తూ పోస్టులు పెట్టింది. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ మాత్రం కామ్ గా ఉండటం గమానర్హం. తాజా సమావేశంపై డీఎంకేతో పాటు.. వివిధ మీడియా సంస్థల స్పందన ఎలా ఉందో చూస్తే..
+ డీఎంకే
మా మధ్య సంప్రదింపులు.. సమాలోచన కేవలం మర్యాద పూర్వకం మాత్రమే.
+ డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ‘‘ఈరోజు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణానికి మద్దతు తెలపాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను మా నేత స్టాలిన్ ఒప్పించారు. ఇక, మే 23 తర్వాత ప్రాంతీయ నాయకులే హీరోలు’’
+ ఎన్డీటీవీ
యూపీఏలో చేరాలన్న స్టాలిన్ ప్రతిపాదనను కేసీఆర్ తోసిపుచ్చలేదు
+ న్యూస్ 18
కాంగ్రెస్ - డీఎంకే మధ్య బలమైన బంధం కారణంగా ఫెడరల్ ఫ్రంట్ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. బీజేపీతో పోరాడడానికి కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపే విషయాన్ని పరిశీలించాలని డీఎంకేనే కేసీఆర్‌ను కోరింది.
+ టైమ్స్ ఆఫ్ ఇండియా
కేసీఆర్ ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా యూపీఏతోనే ఉంటానని స్టాలిన్ స్పష్టం చేశారు. ఆయననే కాంగ్రెస్ కూటమిలోకి ఆహ్వానించారు.
+ పీటీఐ
తన ‘ఉప ప్రధాని ఆకాంక్ష’పై కేసీఆర్ స్టాలిన్ కు చాలా సంకేతాలు ఇచ్చారు. స్టాలిన్ తిరస్కరణతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లైయింది.
+ డీఎన్ ఏ
‘‘కొద్ది రోజుల కిందట కేసీఆర్ తో భేటీకి నిరాకరించిన స్టాలిన్ ఇప్పుడు ఎందుకు కలిశారు!? కాంగ్రెస్ తోనే కలిసి సాగాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా కేసీఆర్ తో భేటీకి ఎందుకు అంగీకరించారు? ఇందుకు కారణం.. కాంగ్రెస్ కూడా వివిధ పార్టీలతో చర్చిస్తోంది. కేసీఆర్ మనసులో ఏముందో తెలుసుకోవాలని స్టాలిన్ ను కోరి ఉంటుంది’’ (చెన్నైకి చెందిన రాజకీయ విశ్లేషకుడు సుమంత్ సి రామన్ ను డీఎన్ ఏ ప్రస్తావించింది)