రాష్ట్ర విభజన సంగతేమో కానీ.. తెలుగు మీడియా సంస్థలకు చుక్కలు కనిపిస్తున్నాయి. మారిన రాజకీయాలతో పాటు.. పరిస్థితులు గతంలో మాదిరి లేని పరిస్థితి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే అర్థమైన నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్నపరిస్థితి.
అందుకేనేమో.. వార్తల విషయం ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటున్న మీడియా సంస్థలకు.. మరో తలనొప్పి వచ్చి పడింది.
తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలు అయిపోయిన నేపథ్యంలో.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చానల్ కావాలన్న వైఖరి ఒకటి వచ్చింది. ఇప్పటికే దినపత్రికలు ఆంధ్రా.. తెలంగాణ.. హైదరాబాద్ అంటూ మూడు ఎడిషన్లను తీసుకొస్తూ.. ఎక్కడి వార్తలకు అక్కడ ప్రాధాన్యత ఇచ్చే విచిత్రమైన కార్యక్రమం ఒకటి మొదలైంది.
ఇక.. టీవీల విషయానికి వస్తే.. కాస్త పేరు ప్రఖ్యాతులు ఉన్న ఛానెళ్లు కొన్ని తెలంగాణకు.. ఆంధ్రాకు వేర్వేరు ఛానళ్లు పెట్టేసుకున్నాయి. కాకపోతే.. ఒకటే ఛానల్ తోముందుకెళుతున్న ఛానల్‌కు తిప్పలు అన్ని ఇన్ని కావు. ఎందుకంటే.. రెండు ప్రాంతాల్లో ఒకేసారి అసెంబ్లీ సమావేశాలు జరగటంతో.. ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి.
దీంతో.. వారు కిందామీదా పడిపోతున్నారు. తాజాగా మరో విచిత్రమైన కార్యక్రమం ఒకటి మొదలైంది. ఏపీ అసెంబ్లీ నుంచి అలిగి బయటకు వచ్చేసిన జగన్ పుణ్యమా అని మీడియాకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. సరిగ్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలోనే అటుపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన సుదీర్ఘ ప్రెస్‌మీట్ ను స్టార్ట్ చేశారు. దీంతో.. వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి. ఏ మీడియా సంస్థకు ఉండే లెక్కలు.. వ్యూహాన్ని అనుసరించి వారు ఆయా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. కాకపోతే.. తాము చేస్తున్న పని విషయంలో మాత్రం విపరీతమైన అసంతృప్తికి జర్నలిస్టులు గురి అవుతున్నట్లు చెబుతున్నారు. వార్తల ప్రాధాన్యత విషయంలోనూ గతం కంటే ఇప్పుడు ఒత్తిడి పెరగటం.. ప్రాధాన్యతలను వ్యూహాత్మకంగా తీసుకోవాలని పరోక్షంగా చేస్తున్న సూచనలు వారిని విపరీతంగా ఇబ్బందిపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మరెంత కాలం సాగుతుందో అర్థం కాని పరిస్థితి అని పాత్రికేయ మిత్రులు వాపోతున్నారు.