డ్ర‌గ్స్ ఇష్యూను మీడియా లైట్ తీసుకుందా?

Update: 2017-07-30 04:53 GMT
నిన్న టీవీలు చూసిన వారికి ఇదే సందేహం రావ‌టం ఖాయం. డ్ర‌గ్స్ విచార‌ణకు సంబంధించిన వార్త‌ల్ని అదే ప‌నిగా బ్రేకింగ్స్ ఇవ్వ‌ట‌మే కాదు.. గ్యాప్ ఇవ్వ‌కుండా అదే ప‌నిగా వార్త‌లు అందించిన వైనం తెలిసిందే. డ్ర‌గ్స్ వార్త‌ల విష‌యంలో మీడియా వ్య‌వ‌హ‌రించిన వైనంపై సినీ ప్ర‌ముఖులు గుర్రుగా ఉండ‌ట‌మే కాదు.. ఏ మాత్రం అవ‌కాశం వ‌చ్చినా మీడియా మీద విమ‌ర్శ‌లు చేసేందుకు వెనుకాడ‌లేదు.మీడియా అత్యుత్సాహంతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. సినీ ప‌రిశ్ర‌మ‌ను టార్గెట్ చేసిన‌ట్లుగా నింద‌లు ఎదుర్కొనే ప‌రిస్థితి.

ప‌న్నెండు మంది సినీ ప్ర‌ముఖుల‌కు అధికారులు నోటీసులు ఇవ్వ‌టం.. ఆ పై విచార‌ణ‌కు హాజ‌రైన సంద‌ర్భంగా నెల‌కొన్న హ‌డావుడి ఎంత‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. ప్ర‌ముఖుల‌ను విచారించిన సంద‌ర్భంగా పెద్ద‌గా స‌మాచారం బ‌య‌ట‌కు రాన‌ప్ప‌టికి..లైవ్ లు పెట్టి.. త‌మ సిబ్బంది చేత చెప్పించిందే.. చెప్పించిన టీవీ ఛాన‌ళ్లు హ‌డావుడి అంతా ఇంతా కాద‌ని చెప్పాలి.

మ‌రి ఇంత‌లా హ‌డావుడి చేసిన మీడియా శ‌నివారం మాత్రం చాలా లైట్ తీసుకున్న‌ట్లుగా క‌నిపించింది. డ్ర‌గ్స్ విచార‌ణకు సంబంధించి హీరో ర‌వితేజ మాజీ డ్రైవ‌ర్ శ్రీనివాస్‌ ను అధికారులు విచారించారు. ఈ సంద‌ర్భంగా మీడియా పెద్ద‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌లేద‌ని చెప్పాలి.  మిగిలిన‌సినీ ప్ర‌ముఖులు విచార‌ణ కోసం అబార్కీ కార్యాల‌యానికి వ‌చ్చిన సంద‌ర్భంగా పెద్ద ఎత్తున వార్త‌లు అందించిన మీడియా.. ర‌వితేజ మాజీ డ్రైవ‌ర్ విష‌యాన్ని ఎందుకు లైట్ తీసుకుంద‌న్న ప్ర‌శ్న‌ను ప‌లువురు సంధిస్తున్నారు.

మిగిలిన సినీ ప్ర‌ముఖుల‌కు అయితే.. వారికి ఉన్న ఇమేజ్ కార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి ఉంటుంద‌ని.. అదే ర‌వితేజ మాజీ డ్రైవ‌ర్ విష‌యంలో ఎవ‌రికి మాత్రం ఆస‌క్తి ఉంటుంద‌ని కొన్ని ఛాన‌ళ్ల‌కు సంబంధించిన వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కార‌ణంతోనే ర‌వితేజ మాజీ డ్రైవ‌ర్ శ్రీనివాస‌రావు విచార‌ణ వార్తను మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏమైనా.. ఇలాంటి తీరు ఏ మాత్రం మంచిది కాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. డ్ర‌గ్స్ విచార‌ణ వివ‌రాల్ని ఇమేజ్ ఆధారంగా కాకుండా.. నిజాల ఆధారంగా.. నేర తీవ్ర‌త‌కు త‌గ్గ‌ట్లుగా ఇస్తే మంచిద‌న్న సూచ‌న వినిపిస్తోంది. ఏమైనా.. డ్ర‌గ్స్ విచార‌ణ‌లో ర‌వితేజ మాజీ డ్రైవ‌ర్ విచార‌ణ ఎపిసోడ్ హ‌డావుడి లేకుండా చాలా కామ్ గా సాగిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News