ఓపక్క కరోనా దెబ్బకు ప్రాణాలు పోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని డబ్బు సంపాదనకు అనువుగా మార్చుకున్న ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా.. కరోనా వేళ.. అత్యవసర మందుల్ని బ్లాక్ మార్కెట్ చేసి.. వేలాది రూపాయిలు కొల్లగొట్టటమే ధ్యేయంగా చేసుకున్న ఒక ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైద్యానికి కీలకంగా చెబుతున్నా రెమ్ డెసివిర్.. ఆక్టెమ్రా (టొసిలీజుమాబ్).. ఫ్యాబీఫ్లూ మందులతో పాటు.. రాపిడ్ టెస్టు కిట్లను చట్ట విరుద్ధంగా అధిక రేట్లకు అమ్మే దందాను పోలీసులు చేధించారు.
సాధారణంగా కోవిడ్ పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ మందుల ధరల్ని.. అమ్మాల్సిన దాని కంటే.. ఐదారు రెట్లు ఎక్కువగా అమ్మేసేవారు. చట్టవిరుద్ధంగా లేని ఆసుపత్రులు.. సంస్థల పేర్లతో ఈ మందుల్ని కొనేయటం ఈ బ్యాచ్ కు అలవాటు. మార్కెట్లో రూ.5400లకు అమ్మాల్సిన రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ ను ఏకంగా రూ.30వేల నుంచి రూ.40వేలకు అమ్మేస్తున్నారు. అదే సమయంలో ఆక్టెమ్రా ఎమ్మార్పీ ధర రూ.40వేలు. దీన్ని ఏకంగా రూ.90వేల నుంచి రూ.లక్షకు అమ్ముతున్నారు.
అక్రమంగా నిల్వలు ఉంచుకోవటంతో పాటు.. వివిధ ఆసుపత్రులు.. సంస్థల పేరుతో వీటిని బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసేవారు. వాటిని.. అత్యధిక ధరలకు అమ్మకాలకు పెట్టారు. వాట్సాప్ ద్వారా పలుగ్రూపుల్లో తమ వద్ద కరోనా నిరోధక మందులు ఉన్నట్లు ప్రచారం చేసేవారు. తమను సంప్రదించిన వారికి ఎక్కువ ధరలకు అమ్మేవారు. అవసరంతో ఉండటం.. మందులు కొనకుంటే ప్రాణాలు పోతాయన్న భయంతో వారు చెప్పిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసేవారు. ఈ అక్రమ దందాకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు.. తాజాగా సికింద్రాబాద్ లోని శ్రీ మెడిక్యూర్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ తో నగరం లోని పలు మెడికల్ ఏజెన్సీలు నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అదుపు లోకి తీసుకొని.. పెద్ద ఎత్తున మందుల నిల్వల్ని స్వాధీనం చేసుకున్నారు.మార్కెట్లో మందుల కొరతను క్రియేట్ చేసి సొమ్ము చేసుకోవాలనుకునే వీరి తీరు చూస్తే.. శవాల మీద పేలాలు అమ్ముకునే దుర్మార్గం వీరి వ్యాపారం లో కనిపించటం ఖాయం.