కరోనా చికిత్సలో ఆస్తమా మందు.. ఫలితం ఉంటుందంటారా!

Update: 2022-04-27 00:30 GMT
కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు రక్షించేందుకు వైద్య నిపుణులు అనేక రకాల మందులను ఉపయోగిస్తున్నారు. అలాగే చాలా రకాల ఔషధ మందులు కూడా వచ్చాయి. తాజాగా కొవిడ్ కు వాడే ఔషధం పై నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. ఆస్తమా కోసం ఉపయోగించే పలు రకాల మందులు.. కరోనాలోని సార్స్-కోవ్-2, కొవిడ్-19 కి కారణమయ్యే వైరస్ పై పని చేస్తుందని తెలిపారు. అంతే కాదండోయ్ రోగ నిరోధక కణాల్లో నుంచి వైరస్ ను తరిమి కొడ్తుందని వివరిస్తున్నారు.

ఉబ్బసం, జ్వరం, దగ్గు, దద్దుర్లు వంటివి వచ్చినప్పుడు కలిగే మంటను తగ్గించడానికి మాంటెలుకాస్ట్ ఉపయోగిస్తారు. అయితే ఇది కరోనా కి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు శాస్త్రవేత్త లను గుర్తించారు. అయితే ఈ ఔషధాన్ని ఎన్ఎస్పీ1 అని పిలువబడే సార్స్-కోవ్-2 ప్రోటీన్ ద్వారా కట్టడి చేస్తుందని ఐఐఎస్సీ లోని పరిశోధకులు వెల్లడించారు. ఇది మానవ కణాల లోపల విడుదలైన మొదటి వైరల్ ప్రోటీన్ లలో ఒకటని వివరించారు.

ఇది శరీరం లోని కరోనా వైరస్ ను అడ్డుకుంటుందని చెప్తున్నారు. సార్స్-కొవ్-2 ఇన్ఫెక్షన్ ను ఎదుర్కోవడానికి మాంటెలుకాస్ట్ సోడియం హైడ్రేట్ ప్రధాన అణువుగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ప్రోటీన్ లో ముఖ్యంగా సి-టెర్మినల్ ప్రాంతంలో మ్యుటేషన్ రేటు మిగిలిన వాటితో పోలిస్తే... చాలా తక్కువగా ఉందని వివరించారు. వైరల్ ప్రోటీన్ ఎనఎస్పీ 1 ఉద్భవించే వైరస్ ఏవైనా రకాల్లో పెద్దగా మారకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు.

కరోనా రోగుల్లో మాంటెలుకాస్ట్ ఆసుపత్రిలో చేరడాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే చాలా మంది కరోనా రోగులకు ఈ మందును సిఫార్సు చేస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నిటికంటే కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని రెండు డోసు లతో పాటు బూస్టర్ డోస్ తీసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదని వివరిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయడం వల్ల మరింత ఉపయోగం ఉంటుందని పేర్కొంటున్నారు.  

గతంలో కరోనా చికిత్స కోసం మధుమేహ నియంత్రణ కోసం వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్‌ ను కూడా వాడొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే కరోనా స్పైక్‌ ప్రొటీన్‌ మానవ ఏసీఈ2 రిసెప్టర్‌తో బంధించకుండా సమర్థంగా అడ్డుకోవడంలో ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుందని గుర్తించారు. కొవిడ్‌ బారిన పడితే ప్రాథమికంగా కన్పించే లక్షణాలైన శరీర కణజాలాల్లో వాపు, రక్తం గడ్డకట్టే సామర్థ్యం గణనీయంగా తగ్గడం తదితరాలను త్రీడీ మానవ వాస్కులర్‌ ఊపిరితిత్తుల నమూనాలో పరిశోధకులు గుర్తించారు. కాకపోతే క్లినికల్ ట్రయల్స్ పూర్తి కానందున వాడకంలోకి తీసుకు రాలేరు.
Tags:    

Similar News