అచ్చంగా సినిమాల్లో మాదిరి జరిగిన ఉదంతం. నాకెందుకులే అన్నట్లు కాకుండా.. తన బాధ్యతను నూటికి నూరు శాతం నిర్వర్తించిన ఒక మెడికో ఉదంతమిది. అనూహ్యంగా ఎదురైన సవాల్ ను స్వీకరించి.. ఒక నిండు ప్రాణాన్ని కాపాడటమే కాదు.. మరో బుల్లి ప్రాణాన్ని ఈ లోకానికి పరిచయం చేసిన ఉదంతంగా దీన్ని చెప్పొచ్చు. ట్రైన్లో ప్రయాణిస్తున్న వేళ.. తాను ప్రయాణిస్తున్న బోగీలోని మహిళకు పురిటి నొప్పులు రావటంతో కంగారు పడుతున్న వారికి ధైర్యం చెప్పి.. తన వంతు సాయాన్ని అందించిన మెడికో ఉదంతమిది.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న దురంతో రైల్లో ప్రయాణిస్తున్నారు శ్రీకాకుళానికి చెందిన గర్భిణి సత్యవతి. తెలతెలవారుజామున..రైలు అనకాపల్లి సమీపంలో నొప్పులు మొదలయ్యాయి. చూస్తుండగానే పెరిగి పెద్దవి అయ్యాయి. రైలు ఆపినా.. వెంటనే వైద్య సాయానికి అవకాశం లేదు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. నిమిషాలు గడుస్తున్న కొద్దీ.. గర్భిణి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
పురిటి నొప్పులు వస్తున్న వేళ.. సత్యవతి భర్త సత్యనారాయణకు ఏం చేయాలో పాలుపోలేదు. కనిపించిన వారందరిని సాయం అడిగారు. ఇలాంటివేళ.. అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న మెడికో స్వాతిరెడ్డి స్పందించారు. ఆమె విశాఖపట్నం గీతం కాలేజీలో వైద్య విద్యార్థిని.
ఆమెను పరీక్షించిన స్వాతిరెడ్డి.. ఆమెకు పురుడు పోయాల్సిన అవసరాన్ని గుర్తించారు. అప్పటికప్పుడు బోగీలోని మహిళల్ని సాయంగా చేసుకున్న ఆమె.. ఆ గర్భిణికి డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డకు సత్యవతి జన్మనిచ్చింది.
సత్యవతి.. సత్యానారాయణలది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నం గ్రామం. సొంతూరు వెళ్లేందుకు వారు ట్రైన్ ఎక్కారు. రాజమహేంద్రవరం దాటి.. అనకాపల్లికి వెళుతున్న వేళలో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంది. దురంతో ఎక్స్ ప్రెస్ కు విశాఖ వెళ్లే వరకు ఎక్కడా హాల్ట్ లేదు. సత్యవతి పరిస్థితి గురించి సమాచారం తెలుసుకున్న టీటీఈ.. రైలును అనకాపల్లి స్టేషన్ లో ఆపించారు. 108 అంబులెన్సులో తల్లీబిడ్డల్నిస్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఆ సమయంలోనూ.. పురుడు పోసిన స్వాతిరెడ్డి సత్యవతి.. సత్యానారాయణ దంపతుల వెంటే ఉన్నారు. సత్యవతిని గైనకాలజిస్టు వైద్య పరీక్షలు నిర్వహించి.. అంతా బాగుందని చెప్పారు. అప్పటివరకు వారి వెంటే ఉన్న స్వాతిరెడ్డి.. ఆ తర్వాత విడిగా విశాఖపట్నానికి బయలుదేరారు. ఆపదలో ఉన్న వేళ.. చాకచక్యంగా డెలివరీ చేసిన మెడికో స్వాతిరెడ్డిని అందరూ అభినందిస్తున్నారు. ఆమె తమ కోసమే రైల్లో ప్రయాణించే దేవతగా కీర్తిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.