విమానంలో ప్రయాణించాలన్నది ప్రతి ఒక్కరి కల.. దాన్ని నెరవేర్చుకోవడానికి అందరూ ప్రయత్నిస్తుంటారు. ఈ ఫిలిప్పీన్స్ కు చెందిన యువతికి కూడా ఆ రోజులు రానే వచ్చాయి. లూఈసా ఎరిస్పే విమానంలోకి ఎక్కుదామని ఆశగా వెళ్లింది. సీటు తీసుకొని కూర్చుంది.. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు.. విమాన సిబ్బందిని అడగగా.. విమానంలో మొత్తంలో మీరొక్కరే ప్రయాణికురాలు అని చెప్పారు. దీంతో అంత పెద్ద విమానంలో ఆ యువతి భయపడలేదు.. ధైర్యంగా తన ప్రయాణాన్ని కొనసాగించింది..
నిజానికి ఫ్లైట్ నిండకపోతే ఒక్కరే ప్రయాణికురాలు ఉంటే విమానయాన సంస్థలు ఆమెను వేరే విమానంలో సర్దుబాటు చేసి విమానం క్యాన్సల్ చేస్తారు. కానీ ఫిలిప్పిన్స్ ఎయిర్ లైన్స్ మాత్రం లూఈసా ఒక్కదాని కోసం విమానాన్ని నడిపి ప్రశంసలు అందుకుంది..
లూఈసా ఎరిస్పే డిసెంబర్ 24న దావోస్ నుంచి మనీలా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంది. విమానంలో ఎంటర్ అయ్యాక కానీ ఆమె కు తెలియలేదు.. విమానంలో ఎవ్వరూ లేరని.. తాను ఒక్కరే ప్రయాణికురాలని.. కానీ విమానం ఖాళీగా ఉన్న విమాన సిబ్బంది ఆమె కు తోడుగా ఉండడంతో భయపడలేదు. మహారాణిలా విమానమంతా కలిగితిరిగి ఆ ప్రయాణంలో తెగ ఎంజాయ్ చేసిందట.. ఖాళీగా ఉన్న విమానంలో సెల్ఫీలు తీసుకుంది. విమాన సిబ్బందితో ఫొటోలు దిగి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
ఒక్క ప్రయాణికురాలి కోసం విమాన ప్రయాణాన్ని వాయిదా వేయకుండా ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ నిబద్ధతతో విమానాన్ని నడపడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎంతో కమిట్ మెంట్ తో సంస్థ పనిచేసిందని కితాబిస్తున్నారు.
Full View