విజ‌య‌మ్మ స‌భ‌కు వెళ్లాలా.. వ‌ద్దా..?

Update: 2021-08-31 07:40 GMT
ఇప్పుడు ఈ ప్రశ్న రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే.. దివంగ‌త ముఖ్య‌మంత్రి, ప్ర‌జ‌ల దేవుడిగా ప్ర‌చారంలో ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతిని పుర‌స్క‌రిం చుకుని.. సెప్టెంబ‌రు 2వ తేదీన ఆయ‌న స‌తీమ‌ణి.. వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌యమ్మ .. హైదరాబాద్ లో ఒక స‌భ‌ను ఏర్పాటు చేశారు. అది కూడా దివంగ‌త వైఎస్ కేబినెట్‌లో ప‌నిచేసిన‌ మాజీ మంత్రులు... రాజ‌కీయ నిపుణులు, స‌ల‌హాదారులు, మేధావులతో ఆమె స‌మావేశం నిర్వ‌మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం రాజ‌కీయ వ‌ర్గాల్లో అత్యంత ఆస‌క్తిగా మారింది.

ఈ స‌మావేశానికి సంబంధించి విజ‌య‌మ్మ ఇప్ప‌టికే నేత‌ల‌కు ఆహ్వానాలు పంపారు. హైదరాబాద్ లోని హోట‌ల్ నోవాటెల్‌లో సెప్టెంబ‌రు 2న సాయంత్రం 5గంట‌ల‌కు ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ ఆహ్వానంలో మాత్రం ఇది రాజ‌కీయ స‌మావేశం కాద‌ని.. పార్టీల‌కు కూడా సంబంధం లేద‌ని ఆమె ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ``విజ‌య‌మ్మ‌గారు వ్య‌క్తిగ‌తంగా మీకు ఆహ్వానం పంపుతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని విజ‌య‌వంతం చేయ‌వ‌ల‌సిందిగా కోరుతున్నారు`` అని మాత్ర‌మే ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ స‌మావేశంపై రాజ‌కీయ నేత‌లు భిన్న‌మైన ఆలోచ‌న‌లు చేస్త‌న్నారు.

అస‌లు వైఎస్ దివంగ‌తులై.. 12 సంవ‌త్స‌రాలు అయిన త‌ర్వాత‌.. ఇప్పుడు ఈ స‌మావేశం ఎందుకు? దీనివెనుక ఏముంది? వంటి అనేక అంశాలు నేత‌ల మ‌ధ్య హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పైగా ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఇక ఆయ‌న కుమార్తె ష‌ర్మిల తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ పార్టీ స్థాపించి అక్క‌డ ర‌ణ‌క్షేత్రంలోకి దూకారు.

ఇప్పుడు ఈ సంధి కాలంలో వైఎస్ పేరిట జ‌రుగుతున్న కార్య‌క్ర‌మానికి వెళ్తే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల ఆగ్ర‌హానికి గురి అవుతామా ? అనేది నేతల మాట‌. ఏపీ సంగ‌తి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. తెలంగాణ‌లో నేత‌లు మాత్రం ఇటీవ‌లే వైఎస్‌ను రాక్ష‌సుడ‌ని.. క్రూర‌డ‌ని కొంద‌రు తిట్టిపోశారు తెలంగాణ అధికార పార్టీలో వైఎస్‌పై అనిన వారే ఎక్కువ‌. సో.. ఇప్పుడు ఈ కార్య‌క్రమానికి హాజ‌రైతే.. ఇబ్బందులు త‌ప్ప‌వా? అనే ఆలోచ‌న చేస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


Tags:    

Similar News