విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని తన పర్యటనలో కాళ్ల మండలం పెద అమిరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కాగా ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ పలువురికి ఆహ్వానాలు పంపింది. అతిథులుగా హాజరుకావాలని కోరింది. ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి, తదితరులకు ఆహ్వానం పంపారు.
ఈ నేపథ్యంలో జూలై 4న భీమవరం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవికి ఆయన అభిమానుల ఘనస్వాగతం పలికారు. జై చిరంజీవ నినాదాలతో భీమవరం మార్మోగింది. దారి పొడవునా.. ప్రతి ఊరిలోనూ మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు స్వాగతం పలికారు. అభిమానులు జనసంద్రంలా వెల్లువలా తరలిరావడంతో భీమవరం వెళ్లే రోడ్లన్నీ జాతరను తలపించాయి.
అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపించారు.
వేదికపైన చిరంజీవి.. ప్రధాని నరేంద్ర మోడీకి శాలువా కప్పి సన్మానం చేయగా మోడీ చిరు భుజం తట్టి ఆత్మీయంగా కొద్ది నిమిషాలపాటు ఆయనతో ముచ్చటించారు. అంతకుముందు చిరంజీవి.. వేదిక మీద ప్రధాని మోదీ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా నమస్కరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చిరంజీవి గురించి మోడీకి చెప్పడం కనిపించింది.
మరోవైపు బీజేపీ పొత్తులో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ కు మాత్రం భీమవరంకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దీనిపై జనసేన సైనికులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ఇంకోవైపు వైఎస్ జగన్ తో వేదిక పంచుకోవడానికి ఇష్టం లేకే పవన్ కల్యాణ్ భీమవరం రాలేదని అంటున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ ను కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారని.. జగన్ తో కలిసి కూర్చోవడం ఇష్టం లేకే ఆయన రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఇంతకుముందే ఒక వీడియో సందేశంలో పవన్ కల్యాణ్.. ప్రధాని మోడీకి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోడీ భీమవరం వస్తున్న సందర్భంగా తన తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రధానికి స్వాగతం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని రావడంపై జనసేనాని హర్షం వ్యక్తం చేశారు.