సహజంగా రాజుల కుటుంబంలో వివాహం అంటే ఎలా ఉంటుంది? అట్టహాసంగా కార్యక్రమాలు - పెద్ద ఎత్తున సందడి - అదిరిపోయే ఆతిథ్యం - అందులో ఘుమఘుమలాడే వంటకాలు..వగైరా మనం ఊహించుకోవచ్చు కదా? పైగా ప్రముఖ దేశానికి చెందిన యువరాజు అంటే ఆ అంచనాలే వేరే ఉంటాయి. కానీ సీన్ రివర్స్ అయింది. రాకుమారుడికి పెళ్లికి అతిథులకు ఆహ్వానం అందింది.అయితే నోట్ ఏముంటుందే....`యువరాజు పెళ్లికి రండి..భోజనాలు వెంట తెచ్చుకోండి!` అని! దీంతో అవాక్కవడం ఆహ్వానం అందుకున్న వారి వంతు అయింది. ఇలా పెళ్లి కారణంగా నవ్వుల పాలయిన యువరాజు ఎవరయ్యా అంటే...బ్రిటన్ రాకుమారుడు హ్యారీ.
ప్రముఖ హాలీవుడ్ నటి మేగన్ మార్కెల్ తో బ్రిటన్ రాకుమారుడు హ్యారీ వివాహం కుదిరిన సంగతి తెలిసిందే. విండ్సర్ క్యాజిల్ రాయల్ ప్యాలెస్ లో ఈ నెల 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. రాకుమారుడి పెళ్లంటే ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్లుచెదిరే ఏర్పాట్లు - వేలాది అతిథులతో సందడిగా ఉంటుంది. అతిథుల కోసం వేలాది రకాల వెరైటీలు ఉంటాయని అందరూ ఊహించుకుంటారు. కానీ, ప్రిన్స్ హ్యారీ వివాహ వేడుకలో మాత్రం అన్ని వంటకాలు చేయడం లేదట. పెళ్లికి వచ్చేవారికి కేవలం అల్పాహారం మాత్రమే వడ్డించేందుకు ఏర్పాట్లు జరిగాయి. భోజనాలు ఇంటి నుంచే తెచ్చుకోవాలని కెన్సింగ్‌టన్ ప్యాలెస్ అధికారులు మీడియా ద్వారా వెల్లడించారు.
ఇక్కడితోనే ట్విస్టుల పరంపర ఆగిపోలేదు. ఈ వివాహానికి ముందు జరిగే పార్టీకి 2,640 మంది అతిథులు హాజరుకాబోతున్నారు. వారిలో 1200 మంది బ్రిటన్ కు చెందిన వారే ఉన్నారు. వివాహానికి మాత్రం కేవలం 600 మంది అతిథిలను మాత్రమే ఆహ్వానించారు. ఆ తర్వాత రాణి ఎలిజబెత్-2 విందు ఏర్పాటు చేస్తారు. ఈ విందు తర్వాత ప్రిన్స్ చార్లెస్ మరో 200 మంది అతిథితులకు విందు ఇవ్వనున్నారు. సరే పార్టీ అంటే ఏదో సన్నిహితులకు మాత్రమే ఇస్తున్నార్లే అని సరిపుచ్చుదాం అనుకుంటే...రాజకుటుంబానికి చెందినవారై కూడా అతిథులను ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు బహిరంగంగానే సెటైర్లు వేస్తున్నారు.