దేశమంతా పొగిడితే..ఆ సీఎం ఆవేద‌న చెందారు

Update: 2016-09-29 13:53 GMT
ఊరంద‌రిది ఒక‌దారి..ఉలిపిక‌ట్టెది మ‌రోదారి అనే సామెత ఆషామాషీగా రాలేదేమో. యురి దాడులకు ప్రతిగా భారత ఆర్మీ ఇవాళ పాకిస్థాన్‌ లోని ప్రాంతాలపై సర్జికల్ దాడులు నిర్వహంచిన విషయం తెలిసిందే. ఈమేరకు ఈ దాడులపై పలువురు నేతలు వ్యాఖ్యాలు చేయ‌గా జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దులో భారత్‌-పాక్‌ మధ్య ఘర్షణలు త్రీవ రూపం దాల్చాయని.. ఈ పరిస్థితులు భారీ విపత్తుకు దారి తీస్తాయి కాబ‌ట్టి నిగ్రహం పాటించాలని ఆమె కోరారు. సమస్యల పరిష్కారానికి యుద్ధం సరికాదని - ద్వైపాక్షిక చర్చలతో శాంతి సాధించాలని హిత‌వు ప‌లికారు.

కేంద్ర‌మంత్రి వెంకయ్యనాయుడు సైన్యం చ‌ర్య‌పై స్పందిస్తూ ..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - భారత సైన్యం చేతిలో దేశం క్షేమంగా ఉందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉన్నారని - ప్రపంచమంతా ఈ చ‌ర్య‌ప‌ట్ల‌ హర్షిస్తుందని వెంక‌య్య‌నాయుడు తెలిపారు. ఛత్తీస్‌ గఢ్ సీఎం రమణ్‌ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్ర‌ధాని మోడీ ఉక్కు సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. ఈ చ‌ర్య‌ దేశ రక్షణ కోసం ఆయనకున్న నిబద్ధత తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌ దీప్ సుర్జెవాలా మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతునిస్తుందని ప్రకటించారు. సర్జికల్ దాడులకు తమ వంతు సహకారం చేస్తామని, ప్రజలను రక్షిస్తున్న సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యదర్శి  సిద్ధార్థనాథ్‌ సింగ్ మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత సైన్యం తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. సరిహద్దులను రక్షిస్తున్న సైన్యాన్ని వారిని ప్రోత్సహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయ‌న‌ అభినందించారు. బాధ్యతగల ప్రభుత్వం తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువగా పనులు చేస్తుందని కితాబిచ్చారు.
Tags:    

Similar News