మరికొద్ది రోజుల్లో ఖాయంగా జరగాల్సిన వరంగల్ ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారపక్ష అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తెను రంగంలోకి దించాలన్న కసరత్తు జరుగుతుంటే.. అధికారపార్టీ ఎత్తులకు కాంగ్రెస్ అధినాయకత్వం మరింత పైఎత్తు వేయనున్నట్లు కనిపిస్తోంది.
వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నా... ఎవరూ ఊహించని అభ్యర్థిని బరిలోకి తీసుకొచ్చి భావోద్వేగాన్ని ఒక్కసారి పీక్ స్టేజ్‌కి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా యూపీఏ హయాంలో స్పీకర్‌గా వ్యవహరించిన మీరా కుమార్‌ని బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన వినిపిస్తోంది.
సామాజికంగానూ.. భావోద్వేగ పరంగానూ మీరా కుమార్‌ది బెస్ట్ ఛాయిస్ అన్న మాట కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన బిల్లును లోక్‌సభలో ఆమోదించటం కోసం మీరాకుమార్ చేసిన కృషి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొని మరీ.. ఆమె అనుకున్న ప్రకారం తెలంగాణ బిల్లును ఆమోదింపచేయటంలో సక్సెస్ అయ్యారు.
వరంగల్ ఉప ఎన్నికను భావోద్వేగ అజెండా మార్చేందుకు మీరాకుమార్ అభ్యర్థిత్వం అవకాశం ఇస్తుందని.. ఆమెకు మించిన ఆప్షన్ మరొకటి ఉండదని అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. తెలంగాణ అధికారపక్షం ఎత్తుల ముందు మీరాకుమార్ నెగ్గుకు వస్తారా? అన్నది ఒక సందేహంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్‌ను నడిపిస్తున్న నేతల్లో ఛరిష్మా ఉన్న నేత లేని లోటు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ భావోద్వేగానికి.. వరంగల్ స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మీరాకుమార్‌ని ఓడిస్తే.. అది కాంగ్రెస్ అధినాయకత్వం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం ఉంది. మరి.. ఈ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.