ఇవాల్టి రాజకీయాల్లోనూ మచ్చలేని వారు ఉంటారా? అంటే వెనుకా ముందు చూసుకోవాల్సిందే. కానీ.. అలాంటి పేరున్న అతి కొద్ది మంది నేతల్లో ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఒకరు. దురదృష్టకరమైన విషయం ఏమంటే.. ఆయన ఈ రోజు కన్నుమూశారు. అనూహ్యంగా చోటు చేసుకున్న అనారోగ్య కారణాలతో ఆయన్ను ఆసుపత్రికి తీసుకొచ్చిన కాసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. 49 ఏళ్ల ప్రాయంలో ఆయన మరణించిన వైనం షాకింగ్ గా మారింది.
ఏపీ పరిశ్రమలు.. ఐటీ శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. రాజకీయాలు చేస్తారు కానీ.. నిత్యం అదే పనిలో ఉండరు. ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఛాతీ నొప్పితో ఆయన కూలబడ్డారు. దీంతో అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
అత్యవసర విభాగంలో ఆయనకు వైద్యం అందించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. వైద్యుల సమక్షంలో ఆయనకు వైద్యం చేస్తుండగానే తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. మంత్రిగా కొనసాగుతున్నారు.
వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు.. విపక్షాలపై అదే పనిగా విరుచుకుపడే వైసీపీ నేతల ధోరణికి దూరంగా ఉంటారని చెబుతారు. మచ్చలేని రాజకీయాలు చేసే కొద్ది మందిలో గౌతమ్ రెడ్డి ఒకరంటారు. ఆదివారమే దుబాయ్ నుంచి వచ్చిన ఆయన.. రోజు తిరిగేసరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వైనం అయ్యో అనిపించేలా మారింది.