రాజకీయ దురుద్దేశ్యంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు టీడీపీ ఇచ్చిన పిర్యాదుల మేరకు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ... కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయగా.. కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కేసుల్లో జగన్ దోషా? నిర్దోశా? అన్న విషయాన్ని కోర్టు ఇంకా తేల్చలేదు. అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్ దోషే అన్న రీతలో ఇష్టారాజ్యంగా ఆరోపణలు గుప్పిస్తూ కోర్టు విచారణలో ఉన్న కేసుకు సంబంధించి కూడా లెక్కలేనన్ని సార్లు మాట్లాడిన వైనం కూడా మనకు తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో తొలి నిందితుడిగా ఉన్న జగన్‌ను ఏ1 అని - రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఏ2 అని టీడీపీ నేతలు అభివర్ణిస్తున్న తీరు కూడా మనకు తెలియనిదేమీ కాదు. అయితే తనపై కేసులు నమోదు కావడానికి ముందు ఎలాంటి కుట్రలు జరిగాయన్న విషయంపై జగన్... అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలను ఆరోపణలను తుత్తునీయలు చేసినా... ఇంకా టీడీపీ నుంచి అవే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఈ తరహా ఆరోపణలు టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపైకీ దూసుకు వచ్చేశాయి. కోర్టు విచారణలో ఉన్న కేసులో జగన్ నిందితుడిగానే ఉన్నా... ప్రజా కోర్టులో మాత్రం చంద్రబాబు ఇప్పటికే ముద్దాయిగా తేలారన్న వాదన వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసమంటూ టీడీపీ ఆర్భాటంగా చేపట్టిన ధర్మపోరాట దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ... వంచనపై గర్జన దీక్షలకు దిగింది. ఇందులో భాగంగా నేటి ఉదయం అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటైన ఈ దీక్షకు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీ పదవులకు రాజీనామా చేసిన నేతలంతా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటాలు - జరుగుతున్న వంచనలపై నేతలు ప్రజలకు ఉదాహరణలతో సహా వివరించే యత్నం చేశారు. ఇందులో భాగంగా దీక్షా వేదిక మీద నుంచి మాట్లాడిన వైసీపీ ఎంపీ - నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి... చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అసలు విభజన చట్లంలోని హామీలన్నింటినీ ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని చట్టం చెబుతుంటే... కేంద్రంలోని బీజేపీ తో నాలుగేళ్ల పాటు స్నేహంగా మెలిగి - ఎన్డీఏ సర్కారులో భాగస్వామిగానూ ఉండి కూడా ఏపీ ప్రజలను నట్టేట ముంచిందని మేకపాటి ఆరోపించారు. అయినా నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా? అని కూడా ఆయన నేరుగా చంద్రబాబునే ప్రశ్నించారు. అసలు ప్రత్యేక హోదాను రాష్ట్రానికి రాకుండా చేసిన వారిలో తొలి నిందితుడు ప్రధాని మోదీ అయితే రెండో నిందితుడిగా (ఏ2గా) చంద్రబాబు నిలుస్తారని ఆయన తనదైన శైలి సెటైర్ సంధించారు. ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు వస్తాయన్న మేకపాటి... ఏపీ విభజన చట్టం హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేసిన ఉద్యమాలను చంద్రబాబు కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాకు కాకుండా ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా కోసమే ఎంపీ పదవులకు తాము రాజీనామాలు చేస్తే, చంద్రబాబు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే పదవులను వదులుకున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏపీలో 150 అసెంబ్లీ - 25 పార్లమెంటు స్థానాల్లో జగన్ దే జయం అని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిని కడిగిపారేసిన మేకపాటి... రాష్ట్రానికి జరిగిన ఈ తీవ్ర అన్యాయం పాపమంతా మోదీ, చంద్రబాబులదేనని తేల్చేశారు. అందుకే మోదీని ఏ1గా - చంద్రబాబును ఏ2గా పరిగణించాలని మేకపాటి ప్రజలకు సూచించారు.