వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ టైం ఏ మాత్రం బాగోలేదన్నట్లుగా ఉంది. ఒకప్పుడు ఆయన పిలుపుతో ప్రభుత్వాలు కూడా పేకమేడల్లా కూలిపోతాయని జగన్.. తనకు తాను చెప్పుకునే వారు.
అలాంటి ఆయన్ను ఇప్పుడు.. తెలంగాణ అధికారపక్షం నేతలైతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తాము అస్సలు లెక్కలోకి వేసుకోవటం లేదన్నారు. ఇంత బతుకు బతికి అన్న చందంగా.. జగన్ లాంటి వ్యక్తిని తాము లైట్ తీసుకుంటామని టీఆర్‌ఎస్ నేతలు బాహాటంగా చెప్పేయటం ఆయన పరిస్థితి ఏమిటన్నది చెప్పకనే చెప్పేస్తుందంటున్నారు. ఇక.. తెలంగాణలో నామమాత్రంగా ఉన్న నేతలంతా పార్టీ నుంచి వెళ్లిపోతున్న పరిస్థితి.
తెలంగాణలో జగన్ పరిస్థితి ఇలా ఉంటే.. సీమాంధ్రలో మరోలా ఉంది. సొంత పార్టీ నేతల్లో కొందరు బీజేపీ వైపు చూస్తుంటే.. మరికొందరు ఏపీ అధికారపక్షం వైపు చూస్తున్నారు.
దీంతో.. వారికి సర్దిచెప్పుకోవటానికి కిందామీదా పడుతుంటే.. జగన్‌కు అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలాంటి నేతలు సైతం టీడీపీ అధినేత చంద్రబాబును పొగిడేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరిపోతే.. కర్నూలు ఎంపీ టీడీపీలో చేరతానని చెప్పి.. ఆగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మేకపాటి లాంటి కరుడుగట్టిన జగన్ వాదులు సైతం బాబును పొగిడేయటం.. బాబు విధానాలు బాగున్నాయని మెచ్చుకోవటం లాంటి పరిణామాలతో పార్టీ క్యాడర్ నోట మాట రాని పరిస్థితి.
నేతలు ఇలా వ్యవహరిస్తుంటే.. పార్టీ పరిస్థితి ఏమిటన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరోపార్టీ మారటం వేరే విషయమని.. కానీ.. మేకపాటి లాంటి నేతలు సైతం ప్రత్యర్థి పార్టీని పొగిడేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ విలేజీల పథకంపై తన వంతు సహకారంఅందిస్తానని చెప్పటమేకాదు.. బాబు తీరును ఆయన ప్రసంశించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.