అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టక ముందు నుంచే సంచలనాల మీద సంచలనాలు సృష్టించిన డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే తీరును ప్రదర్శిస్తూ టాక్ ఆఫ్ ద వరల్డ్ గా మారిన సంగతి తెలిసిందే. ఏడాపెడా సంచలన నిర్ణయాల్ని తీసుకోవటం.. తన దుడుకు వైఖరితో దేశాధినేతలపై విరుచుకుపడటం ఒక ఎత్తు అయితే.. అమెరికాకు మిత్రదేశాధినేతలపైనా మండిపడటం సంచలనంగా మారింది.
పేరుకు 70ఏళ్ల ముసలోడైన ఈ మూర్ఖ శిఖామణి.. బయటే కాదు ఇంటి విషయంలోనూ అదే ధోరణిని ప్రదర్శిస్తున్నారా అంటే అవుననే చెబుతున్నారు. అధ్యక్షుడి హోదాలో వైట్ హౌస్ లో ఉంటున్న ఆయన.. భార్య విషయంలో కటువుగా ఉంటున్న విషయం పలువురి నోట వినిపిస్తోంది. ప్రమాణస్వీకారోత్సవం వేళ.. చిరునవ్వులు చిందిస్తున్న మెలానియాను వెనుదిరిగిన ట్రంప్ ఏదో అనటం.. ఆ తర్వాతఆమె ముఖంలో నవ్వు అన్నది లేకుండా పోవటం తెలిసిందే.
అంతేకాదు.. ప్రమాణస్వీకారం చేయటానికి కొన్ని గంటల ముందు సంప్రదాయం ప్రకారం వైట్ హౌస్ కి వెళ్లిన ట్రంప్.. భార్యకారు దిగేలోపే.. చకచకా వెళ్లిపోయిన వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. కొడుకు చదువు కోసం వైట్ హౌస్ లో ఉండని మెలానియా.. భవిష్యత్తులోనూ అదే తరహాలో వ్యవహరిస్తారని చెబుతున్నారు.
ట్రంప్ పదేళ్ల కుమారుడు బారన్ చదువు కోసం ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటున్న మెలానియా.. కొడుకు చదువు పూర్తి అయ్యాక కూడా వైట్ హౌస్ కు వచ్చే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. న్యూయార్క్ లో ట్రంప్ కు రూ.680 కోట్ల విలువ చేసే రాజసౌధం లాంటి భవనం ఉంది. మెలానియా అందులోనే ఉంటారని.. వారాంతంలో మాత్రమే వైట్ హౌస్ కి వచ్చి వెళతారని చెబుతున్నారు. ఇదంతా ట్రంప్ పుణ్యమేనని చెబుతున్నారు. ఇందులో నిజం మాట ఎంత ఉందన్నది ఒక ప్రశ్న అయితే.. రానున్న రోజుల్లో వైట్ హౌస్ లో ఫస్ట్ లేడీ గెస్ట్ అన్న మాట మాత్రం ఇప్పుడు వినిపిస్తోంది. ఎందుకిలా? అన్న అంశంపై స్పష్టమైన సమాధానం రావాల్సి ఉందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/