ఢిల్లీ ప్రభుత్వ స్కూల్ కి వెళ్లనున్న ట్రంప్ మెలానియా!

Update: 2020-02-22 08:15 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం ట్రంప్ తన విమానంతో సహా ..అహ్మదాబాద్‌ లో ల్యాండ్ అవ్వబోతున్నారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన సందర్భంలో ప్రధాని మోడీతో హైదరాబాద్ హౌజ్‌ లో ట్రంప్ బిజీగా సమావేశం కానుండగా - అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మాత్రం మరోచోట బిజీగా గడపనున్నారు. ట్రంప్ ఒక చోట ఉంటె ...ట్రంప్  మెలానియా ఎక్కడికి వెళ్తుంది ?

ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా .. మంగళవారం రోజున ఆయన ప్రధానితో సమావేశంలో బిజీగా ఉన్న సమయంలో మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. అక్కడ ఆమె ఢిల్లీ సర్కార్ ప్రవేశపెట్టిన హ్యాపీ కరుక్యులమ్ గురించి తెలుసుకుంటారు. అలాగే, హ్యాపినెస్ క్లాసులు సైతం అటెండ్ అవుతారు. అదే సమయంలో పిల్లలతో ముచ్చటిస్తారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ - డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాలు మెలానియాకు హ్యాపీ కరుక్యులమ్ గురించి వివరిస్తారు. అంతేకాదు విద్యార్థులకు బోధన ఎలా చేస్తారనే దానిపై మెలానియాకు వివరిస్తారు. ఒక అగ్రరాజ్యం తొలిమహిళ ఇలా పిల్లలతో ముచ్చటించడం ఇదే తొలిసారి.

ఇదిలా ఉంటే అమెరికా ప్రథమ మహిళా ఏ స్కూలుకు వెళుతుందో ఇప్పటివరకు అధికారులు బయటకు వెల్లడించలేదు. భద్రతాకారణాల దృష్ట్యా ఈ విషయాన్ని ఇంకా బయటకి చెప్పడంలేదు అని సమాచారం. కానీ , ఢిల్లీ పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలని కూడా ఎంతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. మెలానియా తమ స్కూలంటే తమ స్కూలుకు రావాలని - ఢిల్లీ టీచర్లు ఆశపడుతున్నారు. హ్యాపీ కరుక్యులమ్‌ తో ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు వచ్చాయని అవన్నీ మెలానియాకు వివరించాలని టీచర్లు ఆతురతతో ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె 45 నిముషాల పాటు చిన్నారులతో గడపనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ఈ నెల 24న ప్రారంభం కానుంది. కాగా 2018లో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాపీనెస్ క్లాసులను ప్రారంభించారు. చిన్నారుల మానసిక వికాసానికి దోహదపడేలా ఈ తరగతులకు రూపకల్పన చేశారు. దీని ద్వారా విద్యార్థులలో భారీగా మార్పులు వచ్చినట్టు తల్లిదండ్రులు - స్కూల్ టీచర్స్ చెప్తున్నారు.
Tags:    

Similar News