బీ ఎ రోమన్ వైల్ ఇన్ రోమ్....అన్న సామెతను అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ బాగా వంటపట్టించుకున్నట్లున్నారు. భారత పర్యటనకు వచ్చిన మెలానియా ట్రంప్....ఇక్కడి వాతావరణంతో పాటు....ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మసలుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. వస్త్రధారణలో మెలానియా చూపిస్తున్న శ్రద్ధ ఇపుడు హాట్ టాపిక్ అయింది. మొదటి రోజు పర్యటనలో తెల్లటి దుస్తుల్లో మిలమిలా మెరిసిన మెలానియా....రెండో రోజు కూడా తన వస్త్రధారణలో ప్రత్యేకతను చాటుకున్నారు. రకరకాల కమలం పువ్వులు ఉన్న తెల్లటి దుస్తుల్లో మెలానియా అందరి దృష్టిని ఆకర్షించారు. కాకతాళీయమో.....ఏమో గానీ, భారత జాతీయ పుష్పం - భారతీయ జనతా పార్టీ అధికారిక చిహ్నం అయిన కమలం గుర్తు ఉన్న దుస్తులు మెలానియా ధరించి ఔరా అనిపించారు.
ఓ వైపు అధికారిక కార్యక్రమాలు .....ద్వైపాక్షిక ఒప్పందాలతో ట్రంప్ బిజీబిజీగా ఉన్నారు. అందరి దృష్టి ట్రంప్ పైనే ఉంటుందనుకున్న నేపథ్యంలో తన డ్రెస్ సెన్స్ తో మెలానిమా మెస్మరైజ్ చేస్తున్నారు. ఫ్యాషన్ రంగం నుంచి వచ్చిన మెలానియా... తన కాస్ట్యూమ్స్ పై స్పెషల్ ఫోకస్ పెడతారు. భారత్ లో అడుగుపెడుతున్నపుడు మన దేశ విశేషాలను గుర్తు చేసే ఓ సాష్ ను మెలానియా ధరించారు. రెండో రోజు కూడా భారత జాతీయ పుష్పం కమలాన్ని గుర్తు చేసే వస్త్రాలను ధరించారు. తన ఫ్యాషన్ ద్వారా అమెరికా అధ్యక్షుడి దౌత్యనీతిని ఆమె సతీమణి కొనసాగిస్తున్నారంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. మెలానియా ధరించిన ఈ `కమలం` డ్రెస్ డ్రెస్ ఖరీదు దాదాపు 1.15లక్షల రూపాయట. జాతీయ పువ్వుకు గౌరవం ఇచ్చేందుకు ఈ డ్రెస్ ధరించారా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. ఏదేమైనా ట్రంప్ పర్యటనలో ట్రంప్ తోపాటు ఆయన అర్ధాంగి మెలానియా కూడా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారనడంలో సందేహం లేదు.