రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయాలంటే వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే తిరుగులేని రాజకీయ వ్యూహం ఈ మధ్యన పాపులర్ అయ్యింది. దేశంలోని పలు ప్రభుత్వాలు చేస్తున్న ఈ పనినే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థిపై చేపట్టారన్న ఆరోపణ ఇప్పుడు అభిశంసన వరకూ వెళ్లింది.
ప్రత్యర్థి కుటుంబం చేసే వ్యాపారాల్ని దెబ్బ తీయటం.. తమ చేతిలో ఉన్న వ్యవస్థల్ని ఇందుకు వినియోగించటం.. తమకున్న అధికారంలో ప్రత్యర్థి తిరిగి కోలుకోకుండా ఉండేలా చేసే ఈ దుర్మార్గపు ప్లాన్ ను ట్రంప్ చేపట్టారంటూ డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్ కు గట్టి పోటీ ఉన్న వేళ.. ఆయన్ను దెబ్బ తీసేందుకు ట్రంప్ దారుణంగా వ్యవహరించినట్లుగా ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు.
బ్రైడన్ కొడుకు హంటర్ బైడన్ కు ఉక్రెయిన్ లో భారీగా వ్యాపారాలు ఉన్నాయి. ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్.. తనకున్న పలుకుబడితో తన ప్రత్యర్థికి చెందిన వ్యాపారాల్ని దెబ్బ తీయాలని ప్లాన్ చేశారని.. అందుకు అక్కడి ప్రభుత్వ సాయాన్ని కోరినట్లుగా ఆరోపణలున్నాయి. బైడన్ కొడుకు మీద అవినీతి కేసుల్ని వేగవంతం చేయాలన్న ఒత్తిడిని అంతకంతకూ పెంచుతున్నారని చెబుతున్నారు.
ఇందులో భాగంగానే ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లుగా అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందిందని చెబుతున్నారు. ట్రంప్ చర్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై డెమొక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మీద అభిశంసనకు రంగం సిద్ధం చేశారు.
ట్రంప్ మీద అభిశంసనకు రెఢీ కావటం.. బలం లేక వీగిపోవటం గతంలో జరిగాయి. కానీ.. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిపై పెట్టే అభిశంసనలో కీలకం సెనేట్. సెనెట్ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరుగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే వీలుంది. సెనేట్ లోని సభ్యుల్లో మూడింట రెండింతలు అంటే 67 మంది సభ్యులు కానీ ట్రంప్ నకు వ్యతిరేకంగా ఓటు వేస్తే.. ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది.
గతంలో అభిశంసనను పలువురు అధ్యక్షులకు ఎదురైనా.. ఎవరూ అభిశంసనకు గురి కాలేదు. ఇప్పటివరకూ సభలో 60 సార్లకు పైనే అభిశంసన ప్రక్రియ జరిగినప్పటికీ ఇప్పటివరకూ ఏ ఒక్కరూ దీని కారణంగా పదవిని పోగొట్టుకోలేదు. అభిశంసన ప్రక్రియ సుదీర్ఘకాలం సాగే న్యాయప్రక్రియ. అధ్యక్షుడిపై నమోదైన అభియోగాల్ని సాక్ష్యాధారాలతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రతినిధుల సభ సాధారణ మెజార్టీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అభిశంసన పెట్టినంత తేలిక కాదు దాన్ని నిరూపించటం. మరి.. ట్రంప్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.