షాకింగ్ సర్వే.. ఆడవారి చేతిలో అలా అయిన మగాళ్లు ఎందరో?

Update: 2020-04-15 02:30 GMT
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఇప్పటివరకూ పెద్దగా చర్చకు రాని ఒక అంశం తాజాగా ఒక సర్వే పుణ్యమా అని తెర మీదకు వచ్చింది. ఒక మహిళకు ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే దాన్ని రేప్ అనేస్తారు. నిజానికి ఇలాంటి ఎన్నో కేసులు చూస్తుంటాం. మరి.. ఒక మగాడికి ఇష్టం లేకున్నా.. మహిళ బలవంతంగా సెక్స్ చేయటాన్ని రేప్ అనొచ్చా? దాన్ని నేరంగా చూస్తారా? అన్న ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పేవారు కనిపించరు.

మిగిలిన దేశాల సంగతేమో కానీ.. ఇంగ్లండ్.. వేల్స్ లోని చట్టాల ప్రకారం మహిళలు బలవంతంగా సెక్సు చేయటాన్ని రేప్ కింద పరిగణించరు. ఈ కారణం చేతనే మహిళల చేతుల్లో బలత్కారానికి గురైన మగాళ్ల ఉదంతాలు బయటకు రావంటూ ఒక అధ్యయనం తాజాగా వెల్లడించింది. లాంకాస్టర్ వర్సిటీ లా స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ సియోభన్ వేర్ యూకేలో నమోదైన అత్యాచార కేసుల్ని అధ్యయనం చేశారు. ఆన్ లైన్ సర్వేలో 200 మంది మగాళ్ల నుంచి అభిప్రాయాల్ని సేకరించారు. ఇటీవల ప్రచురితమైన ఈ సర్వే అంశాల్లో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

అందులో పలువురు మగాళ్లు తాము బలవంతపు సెక్సును ఎదుర్కొవాల్సి వచ్చిందని చెప్పుకోవటం గమనార్హం. బయటకు వెళ్లి వచ్చిన మగాళ్లు.. ఇంటికి రాగానే సెక్సు కావాలని బలవంతం చేస్తే ఎలా ఉంటుందో.. అలాంటి అనుభవాల్ని చాలామంది మగాళ్లు తాము ఎదుర్కొన్నట్లుగా చెప్పినట్లు పేర్కొన్నారు. తమ భార్యలు పలుమార్లు తమ ఇష్టానికి భిన్నంగా రొమాన్సు చేశారని భర్తలు వాపోయాడు. సెక్సుకు నో చెప్పిన సందర్భాల్లో భార్యల చేత దెబ్బలు తిన్న భర్తలు ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది.

తాము మగాళ్లం కావటంతో.. తమకు ఇలాంటి బాధలు ఉంటాయని చెప్పినా ఎవరూ నమ్మరని పురుష పుంగవులు కొందరు వేదనను వ్యక్తం చేయటం గమనార్హం. తన భార్య తన చేతులు కట్టేసి మరీ బలవంతంగా రాత్రంతా సెక్సు చేసేదని.. ఆమె గర్భవతి అయిన కొన్నిరోజుల పాటు తాను ప్రశాంతంగా ఉన్నట్లుగా ఒక భర్త పేర్కొన్న వైనం వింటే షాక్ కు గురి కాక తప్పదు. ఇదంతా చదివిన తర్వాత ఇష్టం లేకుండా మగాళ్లతో బలవంతంగా సెక్సు చేయించే వైనాన్ని ఏమనాలి?
Tags:    

Similar News