వర్తమాన ఫుట్ బాల్ దిగ్గజాలు ఎవరు..? మైదానంలో జట్టంతా ఒక ఎత్తు.. అతడు మాత్రం ఒక ఎత్తు ఎవరు..? అతడిని మూసేస్తే సగం గెలిచినట్లే అనిపించేది ఎవరి విషయంలో..? ఇవన్నీ ప్రస్తుతానికి ఫుట్ బాల్ లో ఒకరిద్దరికే వర్తిస్తాయి. వారే అర్జెంటీనా ఫార్వర్డ్ లయోనల్ మెస్సీ, పోర్చుగల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో. సమకాలీకులైన వీరిద్దరూ దాదాపు దశాబ్దన్నరగా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. మెస్సీ తన మాయతో మెస్మరైజ్ చేస్తుంటే.. రొనాల్డో తనదైన శైలిలో ఉర్రూతలూగిస్తున్నాడు. అయితే, వీరిద్దరిలో అత్యుత్తమ ఆటగాడు ఎవరంటే మాత్రం ఫుట్ బాల్ విశ్లేషకుల మధ్య భిన్నమైన అభిప్రాయాలున్నాయి. కాగా, సగటు అభిమాని మాత్రం మెస్సీనే అత్యుత్తమ ఆటగాడని చెబుతాడు.
ఒక పీలే, ఒక రొనాల్డో, ఒక మారడోనా..
ఫుట్ బాల్ అంటే యూరప్, దక్షిణ అమెరికా దేశాల మధ్య ఆధిపత్య పోరు. యూరప్ లో జర్మనీ, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ.. దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ.. దశాబ్దాలుగా నువ్వా నేనా? అన్నట్లు తలపడుతున్నాయి. వీటిలో కొన్నిసార్లు దక్షిణ అమెరికా దేశాలు, మరికొన్నిసార్లు యూరప్ దేశాల ఆధిపత్యం సాగుతుంటుంది. ఈ క్రమంలో వివిధ ఫుట్ బాల్ లీగ్ లలోనూ ఆటగాళ్ల మధ్య సమరం సాగుతుంటుంది. అందులో మెస్సీ, రొనాల్డోలు ప్రాతినిధ్యం వహించే లీగ్ ల మ్యాచ్ లను చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
కాగా, దక్షిణ అమెరికా ఖండం నుంచి వచ్చిన మేటి ఫుట్ బాట్ ఆటగాళ్లలో పీలే, మారడోనా, రొనాల్డో తర్వాత మెస్సీనే అత్యుత్తమం. అలాంటి మెస్సీ వచ్చే నెల నుంచి జరుగనున్న ప్రపంచ కప్ తర్వాత రిటైర్ కానున్నట్లు ప్రకటించాడు. నవంబరు 20 నుంచి గల్ఫ్ దేశం ఖతర్ లోఈ ప్రపంచ కప్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ మరోసారి ఫేవరెట్ గా బరిలో దిగుతోంది.
2006 నుంచి మాయ మొదలు
మెస్సీ ఇప్పటివరకు నాలుగు ప్రపంచ కప్ లలో ప్రాతినిధ్యం వహించాడు. తొలిసారి 2006 ప్రపంచ కప్ ఆడాడు. 2010, 2014, 2018లోనూ ప్రతిష్ఠాత్మక కప్ బరిలో దిగాడు. వచ్చ నెల నుంచి జరుగబోయే ప్రపంచ కప్ అతడికి ఐదోది. కాగా, 2014లో బ్రెజిల్ లో జరిగిన ప్రపంచ కప్ లో మెస్సీ అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టును ఫైనల్ కు చేర్చాడు. జర్మనీతో జరిగిన నాటి ఫైనల్లో 0-1 తేడాతో అర్జెంటీనా పరాజయం పాలైంది.
మారియో గోర్జె చేసిన అద్భుత గోల్ తో జర్మనీ కప్ ను ఎగురేసుకుపోయింది. అయితే, చివర్లో మెస్సీకి ఫ్రీ కిక్ అవకాశం వచ్చింది. ప్రపంచ మంతా ఊపిరిబిగబట్టి చూస్తుండగా మెస్సీ కొట్టిన ఫ్రీకిక్ గోల్ పోస్ట్ మీదుగా వెళ్లిపోయింది. అయితే, అప్పటికే అది 120వ నిమిషం కావడం.. ఎక్స్ ట్రా ఎక్స్ ట్రా సమయం కావడంతో చేసేందుకు ఏమీ లేకపోయింది. అర్జెంటీనా రన్నరప్ గా మిగిలిపోయింది. కాగా దీనికి ఏడు నిమిషాల ముందు.. అంటే 113వ నిమిషంలో మారియో గోర్జె గోల్ చేయడం విశేషం.
ఈ సారైనా కప్ అందిస్తాడా??
రికార్డు స్థాయిలో ఐదో ప్రపంచ కప్ ఆడనున్న మెస్సీ ఈసారైనా అర్జెంటీనాకు కప్ అందిస్తాడా? లేదా? అనేది చూడాలి. 37 ఏళ్ల మెస్సీ.. 'ఖతర్ ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలు నా చివరి కప్, నేను శారీరకంగా బాగానే ఉన్నా కచ్చితంగా ఇదే చివరి ప్రపంచ కప్'' అని రిటైర్మెంట్ ప్రకటనలో చెప్పాడు. దీంతో ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర నిరాశలో అదే సమయంలో ఈసారైనా కప్ అందిస్తాడన్న ఆశలో ఉన్నారు. కాగా, ''నేను ప్రపంచకప్‌కు రోజులు లెక్కపెడుతున్నాను,ఈ పోటీల్లో ఏమి జరగబోతోందనేది ఆసక్తిగా మారింది'' అని మెస్సీ తన రిటైర్మెంట్
ప్రకటనలో పేర్కొన్నాడు. మరోవైపు 2018 ప్రపంచ కప్ నకు రష్యా ఆతిథ్యం ఇచ్చింది. నాడు ప్రత్యర్థులు మెస్సీని వ్యూహాత్మకంగా మూసేసి అర్జెంటీనాను కట్టడి చేశారు. దీంతో ప్రి క్వార్టర్స్ లోనే ఆ జట్టు వెనుదిరిగింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.