దాదాపు 5 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి బారినపడ్డవారి సంఖ్య అక్షరాలా అరకోటి దాటింది. చైనాలో గత ఏడాది వెలుగు చూసిన ఈ వైరస్… భూమండలాన్ని చుట్టుముట్టి తన గుప్పిట్లో బంధించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోంది. రోజురోజుకి కేసుల ఉధృతి పెరుగతూనే పోతోంది. వైరస్ వెలుగు చూసిన చైనాలో బీభత్సం సృష్టించిన వైరస్, ఆ తర్వాతి కాలంలో యూరప్ ను అతలాకుతలం చేసింది. అక్కడ కేసుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా అగ్ర రాజ్యాన్ని పూర్తిస్థాయిలో కుదిపేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా మెక్సీకో దేశంలోని మాంటోమొరోలెస్ మున్సిపాలిటీలో ఈ వైరస్ రూపంలో ఉన్న వడగళ్లు పడటం అక్కడి ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అచ్చు ఈ వైరస్ ను పోలి ఉన్న ఆ వడగళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యానికి గౌరౌతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇదంతా భగవంతుడి లీల అని నమ్ముతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం ఇదంతా సాధారణమేనని చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాల సమయంలో కొన్ని సార్టు.. గాల్లో ఉండగానే వడగళ్లు ఒకదానితో మరొకటి ఢీకొని ఇటువంటి ఆకృతులు పొందుతాయని వారు చెబుతున్నారు. అయితే మెక్సీకోనే కాకుండా అనేక దేశాల్లో ఇటువంటి ఘటనలు జరిగాయని తెలుస్తోంది.