అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నోటికి ఏమనిపిస్తే దాన్ని అనేయటమే కానీ.. ఆచితూచి మాట్లాడటం ఆయనకు అస్సలు రాదు. చైనాలో పుట్టిన కరోనా.. అగ్రరాజ్యానికి అంటటమే కాదు.. అంతకంతకూ విస్తరిస్తున్న వైనం ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చూస్తుండగానే కరోనా బారిన పడి అమెరికాలో ఇప్పటివరకూ 48 మంది మరణించటం ఒక ఎత్తు అయితే.. పెద్ద ఎత్తున కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.
దీంతో.. ట్రంప్ సర్కారు తెగ హడావుడి పడుతోంది. వైరస్ విస్తరించకుండా ఉండేందుకు తాము తీసుకుంటున్న జాగ్రత్తలు ఏ మూలకు సరిపోకపోవటం.. వందల సంఖ్యలో అనుమానితులు పెరిగిపోవటంతో అగ్రరాజ్యానికి ఇప్పుడేమీ తోచని పరిస్థితి. ఇలాంటివేళ.. వైరస్ కట్టడి కోసం కొత్త నిర్ణయాల్ని ప్రకటించేందుకు హడావుడి ప్రదర్శిస్తోంది ట్రంప్ ప్రభుత్వం.
దేశాధ్యక్షుడు ట్రంప్ తాజాగా మాట్లాడుతూ.. మెక్సికో తో తమకున్న సరిహద్దుల్ని మూసివేయాలన్న ఆలోచనను ప్రకటించారు. మెక్సికో నుంచి కరోన వ్యాధిగ్రస్థులు తమ దేశానికి వచ్చే ప్రమాదం ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆ దేశం తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించింది.
ఇప్పటివరకూ తమ దేశంలో కరోనా కేసులు కేవలం 16 మాత్రమే నమోదు అయ్యాయని.. అలాంటప్పుడు తమ దేశ ప్రజలు అమెరికాలోకి వస్తే తమకే నష్టమని ఆ దేశమంటోందని.. కానీ.. అమెరికన్ల నుంచే మెక్సికన్లకు కరోనా సోకే ప్రమాదం ఉందంటూ వేసిన పంచ్ అదిరేలా మారింది. నిజమే.. ఇప్పటికి అమెరికాలో 2270 కేసులు నమోదు అయితే.. ఒక్క శుక్రవారం నాడే కొత్తగా 500 కేసులు నమోదైన వేళ.. వేరే దేశాన్ని తప్పు పట్టటం కంటే.. తమ దేశంలో కరోనా వ్యాప్తిపై మరింత జాగరూకతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నది ట్రంప్ మాష్టారు గుర్తిస్తే మంచిది.