ట్రంప్ ను గోడ కట్టుకోమన్న మెక్సికో

Update: 2016-07-11 07:21 GMT
తన మాటలతో తరచూ వార్తల్లోకి ఎక్కే అమెరికా అధ్యక్ష అభ్యర్థుల్లో ఒకరైన డోనాల్డ్ ట్రంప్ కు ధీటైన రిటార్ట్ మెక్సికో ఇచ్చింది. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్.. పలు దేశాల మీద నోరు పారేసుకోవటం ట్టతెలిసిందే. అమెరికా సరిహద్దుల్లో ఉండే మెక్సికోపై దురుసు వ్యాఖ్యలు చేయటమే కాకుండా.. రెండు దేశాల మధ్య గోడ కట్టిస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

 మెక్సికన్లు వలసవాదులని.. రేపిస్టులు.. డ్రగ్ డీలర్లుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన మెక్సికో అధ్యక్షుడు పెనా నోటో తాజాగా ట్రంప్ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిట్లర్.. ముస్సోలినీ లాంటి నియంతల మైండ్ సెట్ ట్రంప్ కు ఉందని.. అమెరికా.. మెక్సికో మధ్యన గోడ నిర్మిస్తే నిర్మించుకోవచ్చని.. దాని వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు.

గోడ కట్టుకునే వ్యవహారం అమెరికా అంతర్గత అంశంగా ఆయన తేల్చేశారు. గోడ కట్టటం వల్ల తమకెలాంటి నష్టం లేదని స్పష్టం చేసిన మెక్సికో అధ్యక్షుడు ట్రంప్ తీరును తీవ్రంగా ఖండించారు. ఇరుగు పొరుగు మొదలుకొని.. ప్రపంచంలో పలు దేశాల మీద విరుచుకుపడే ట్రంప్ ను అమెరికన్లు ఎంతమేర ఆదరిస్తారో చూడాలి.
Tags:    

Similar News