షేన్‌వార్న్ గురించి ఎవరికీ తెలియని టాప్సీక్రెట్ ఇదే.. చెప్పేసిన క్లార్క్
షేన్‌వార్న్ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం. అతడు ప్రపంచ ప్రఖ్యాత స్పిన్నర్ అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాను తన స్పిన్ మాయాజాలంతో ఎన్నోసార్లు గట్టెక్కించాడు వార్న్. అతడు బౌలింగ్ చేస్తున్నాడంటే.. స్టార్ బ్యాట్స్మెన్లు సైతం హడలిపోయేవారు. ‘ఈ ఓవర్ తొందరగా పూర్తయితే బాగుండు దేవుడా ’ అనుకొనేవారంట. తన బంతితో ఎన్నో విన్యాసాలు చేసి అగ్ర స్థాయి బౌలర్ గా పేరుతెచ్చుకున్న షేన్ వార్న్ జీవితం వివాదాస్పదం కూడా అయ్యింది. అతడిపై అనేక ఆరోపణలు వచ్చాయి. టెస్టు క్రికెట్ చరిత్రలో వార్న్.. 145 మ్యాచుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. డ్రగ్స్ సహా పలు రకాల ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే కాక.. మొత్తం ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే షేర్ వార్న్ ఓ విభిన్నమైన, అద్భుతమైన బౌలర్ అని చెప్పక తప్పదు.
నేటితరం స్పిన్నర్లు ఎంతో మంది షేన్ వార్న్ ను స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్.. షేన్‌వార్న్ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నాడు. జట్టును విజయతీరాలకు అందించిన షేన్‌వార్న్.. మీడియా తో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాడని క్లార్క్ చెప్పాడు. అతడు ఫామ్ కోల్పోయిన ప్రతిసారీ మీడియా అతడిమీద వార్తలు రాసేదని క్లార్క్ చెప్పుకొచ్చాడు. అంతేకాక.. షేన్‌వార్న్.. ఒత్తిడిని జయించేందుకు సిగరెట్లు తాగేవాడని.. బౌలింగ్ చేసేకంటే ముందు అతడు స్మోకింగ్ చేసేవాడని చెప్పాడు క్లార్క్.
'వార్న్ మానసికంగా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. అతడి వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వచ్చాయి. మీడియా నుంచి అతడికి చాలా ఒత్తిడి ఉండేది. అనేక సందర్భాల్లో మీడియా అతడి మీద దుష్ప్రచారం చేసేది. ఈ తప్పుడు ప్రచారాన్ని తప్పించుకొనేందుకు వార్న్.. సిగరెట్లు కాల్చేవాడు. తనపై మీడియా తప్పుడు ప్రచారం చేసిన ప్రతిసారి తన బంతితోనే సమాధానం చెప్పేవాడు. అదే అతడి స్టయిల్. అయినప్పటికీ అతడిపై తప్పుడు ప్రచారం తప్పలేదు.’ అంటూ షేన్‌వార్న్ పై పలు విషయాలను పంచుకున్నాడు క్లార్క్.