అమెరికాలోని కాన్సాస్ కాల్పుల ఘటనపై సామాన్య జనంతో పాటు టెక్ దిగ్గజాలు కూడా ఘాటుగా స్పందిస్తున్నాయి. కాన్సాస్ లోని ఓ బార్ లో జాతి విధ్వేషంతో నిండిన ఓ అమెరికన్ తుపాకీ తీసి ఇద్దరు ప్రవాస భారతీయ ఇంజినీర్లు, ఓ అమెరికన్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తెలుగు నేలకు చెందిన కూబిభొట్ల శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో తెలుగు ఇంజినీర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఊహించని ఈ ఘటనపై తెలుగు ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేయగా, తెలుగు నేలకే చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా నోరు విప్పారు.
ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సత్య నాదెళ్ల... ఆధునిక సమాజంలో మతిలేని హింసకు, మత విధ్వేషానికి తావు లేదని కరకు స్వరాన్ని వినిపించారు. సౌమ్యుడిగా పేరున్న సత్య నాదెళ్లను కాన్సాస్ ఘటన తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందని ఆయన చేసిన వ్యాఖ్యలే చెబుతున్నాయి. కాన్సాస్ ఘటనను మతిలేని హింసతో పోల్చిన సత్య నాదెళ్ల... అలాంటి ఘటనకు ఆధునిక సమాజం తావు ఇవ్వరాదని పిలుపునిచ్చారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసస్ కూచిభొట్ల, గాయపడ్డ అలోక్ కుటుంబాలతో పాటు గాయాలతో బయటపడ్డ అమెరికన్ కుటుంబానికి కూడా అండగా ఉంటామని హామీ ఇస్తూ తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉంటే... సత్య నాదెళ్ల కంటే ముందుగానే అమెరికా చట్టసభల్లోని తెలుగు సంతతి ప్రతినిధులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/