వర్కఫ్రం హోంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్‌ఫ్రం హోం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి విస్తరించిన దాదాపు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం వల్ల అనేక కంపెనీలు లాభపడ్డాయి. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ లాభపడింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిపై ఈ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్‌ఫ్రం హోం విధానంపై ఆయన స్ట్రీట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ భేటీలో మాట్లాడారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ లాభాలు ఉన్నప్పటికీ ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు ఇబ్బందులు పడతారు. ఉద్యోగులు చాలా తొందరగా అలసిపోయే అవకాశం ఉంది. పని వాతావరణం నుంచి ప్రైవేట్ లైఫ్‌కు మారడంలో ఇబ్బందులు ఎదురవుతాయి’అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
వర్క్‌ఫ్రంహోం భాగంగా ఆన్లైన్ సమావేశాలు ఎక్కువగా నిర్వహించాల్సి వస్తుందన్నారు. దీనివల్ల ఉద్యోగులు ఎక్కువగా అలసిపోతారని చెప్పారు. ఉద్యోగులపై పని ఒత్తడి కూడా ఎక్కువ ఉంటుందని చెప్పారు. రిమోట్ వర్కింగ్ వల్ల ఆఫీస్ ప్రయోజనాల్ని ఉద్యోగులు కోల్పోతున్నారని సత్య నాదెళ్ల అన్నారు. వీడియో సమావేశాలు లాంఛనంగా మారాయన్నారు. దీనిని పరిష్కరించేందుకు మైక్రోసాఫ్ట్ వద్ద కొత్త ప్లాన్ ఉందన్నారు. ఆఫీస్ వాతావరణాన్ని పునఃసృష్టించేందుకు, ఆడిటోరియం, సమావేశ గది, కాఫీ బార్ వంటి వర్చువల్ ప్రదేశంలో వీడియో కాల్స్‌లో పాల్గొనేలా చేస్తామన్నారు. వర్క్ ఫ్రమ్ హోం వల్ల క్లౌడ్ సేవలు అందిస్తున్న మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది ఇప్పటికి 30 శాతం ఎగిశాయి. పని, వ్యక్తిగత కార్యకలాపాల మధ్య సమన్వయం ఎలా చేసుకోవాలనేది కరోనా తనకు నేర్పించిందని సత్య నాదెళ్ల అన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా కొత్త నియామకాలు వర్చువల్‌గా జరుగుతున్నాయని గుర్తు చేశారు. కొత్త ఉద్యోగులు రిమోట్‌గా చేరుతున్నారని.. వారికి శిక్షణ ఇవ్వడం చాలా కష్టతరంగా మారిందని చెప్పారు.