మైక్రోసాఫ్ట్. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ. బిల్‌గేట్స్ ఈ సంస్థను ప్రపంచంలోనే అన్నింటి కన్నాముందు వరుసలో నిలబెట్టారు. అయితే.. బిల్ గేట్స్‌పై కొన్నాళ్ల కిందట లైంగిక ఆరోపణలు వచ్చాయి. 2007లో గేట్స్ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ గా ఉన్న వేళలో ఒక మహిళా ఉద్యోగికి ఆయనపై లైంగిక ఆరోపణలు చేశారు. తనకు అభ్యంతరకర ఈ మొయిల్ పంపించారని, పర్సనల్ గా బయట కలవాలని ఆహ్వానించారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి పెట్టిన కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల టీం గేట్స్ కు వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి తప్పుకున్నట్లుగా బిల్ గేట్స్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో లింగ వివక్ష లాంటి అంశాల్లో కంపెనీ విధానాల్ని సమీక్షించాలని కంపెనీ షేర్ హోల్డర్లు సూచనలు చేశారు. దీనికి మైక్రోసాఫ్ట్ అంగీకరించింది. ఈ డిమాండ్ ను ప్రధానంగా వినిపించిన షేర్ హోల్డర్లలో అర్జున క్యాపిటల్ ఒకటి. ఇందులో భాగంగా ''అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్ పీ'' అనే న్యాయ విచారణ సంస్థను నియమించుకొని.. గేట్స్ మీద వచ్చిన ఆరోపణలను సమీక్షించనుంది. అదేసమయంలో 2019 తర్వాత బోర్డు సభ్యులతో సహా ఇతర ఉన్నతస్థాయి వ్యక్తులపై వచ్చిన అన్ని రకాల వేధింపుల ఆరోపణలపైనా విచారణ చేయాలని నిర్ణయించింది.
ఈ విచారణ అనంతరం బోర్డుకు.. కంపెనీ యాజమాన్యానికి ఈ న్యాయ విచారణ సంస్థ కొన్ని సిపార్సులు చేయనుంది. దీనికి సంబంధించిన నివేదిక మరో రెండు మాసాల్లో అందే అవకాశం ఉంది. తమ విచారణలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆందోళనలు.. వాటి పరిష్కారానికి కంపెనీ తీసుకున్న చర్యలపైనా ఈ విచారణ సంస్థ ప్రధానంగా ఫోకస్ చేయనుంది. ఇతర కంపెనీల్లో అనుసరించే ఉత్తమ విధానాలతో మైక్రోసాఫ్ట్ నిబంధనల్ని పోల్చి రేటింగ్ కూడా ఇవ్వనుంది.
ఈ అంశంపై మెక్రోసాఫ్ట్ కు సీఈవోగా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. కంపెనీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు తమకున్న అవకాశంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేవలం సమీక్షకు మాత్రమే కాకుండా ఉద్యోగుల అనుభవాల్ని కూడా పరిగణనలోకి తీసుకొని సంస్థను మరింత ఉన్నత స్థానంలోకి తీసుకెళతామని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.