హైదరాబాద్ లో యువకుల వీరంగం.. పోలీసుల వాహనాన్నే ధ్వంసం చేసి హల్ చల్

Update: 2022-06-14 12:30 GMT
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ సేవించి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. తాజాగా మెహిదీపట్నంలోని ఆసిఫ్ నగర్ లో సోమవారం అర్ధరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర యువకులు గంజాయి తాగి హల్ చల్ చేశారు.

గంజాయి మత్తులో వాహనదారులపై దాడులు చేశారు. కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని యువకులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులపైన కూడా వారు దాడికి దిగారు. ఓ యువకుడు పోలీసు వాహనంపైకి ఎక్కి నానా హంగామా సృష్టించాడు. పలు వాహనాల అద్దాలను మిగతా యువకులు ధ్వంసం చేశారు.

ఈ క్రమంలోనే గంజాయి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి దేహశుద్ధి చేశారు. అజయ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తసీుకున్నారు. సదురు యువకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గంజాయి సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అయితే వీరు ఇంతలా రెచ్చిపోవడానికి గల కారణాలపై పోలీసులు తేల్చే పనిలో పడ్డారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారన్నది తేల్చేందుకు హైదరాబాద్ పోలీసులు ఆరాతీస్తున్నారు. మిగతా వారిని పట్టుకునేందుకు  టీంలను ఏర్పాటు చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆసిఫ్ నగర్ లో ఏకంగా  మందుబాబులు పోలీసుల వాహనం ఎక్కి వీరంగం సృష్టించిన వీడియోను షేర్ చేశారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు.

మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి పోలీసుల వాహనాలపై దాడులు చేసే స్థాయి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైదరాబాద్ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? అంటూ ప్రశ్నించారు. పౌరసమాజం రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


Tags:    

Similar News