తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో బయపటడిన 9 మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి అయ్యింది.ఒకే బావిలో 9 మంది వలస కార్మికుల మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గురువారం 4 మృతదేహాలు - శుక్రవారం మరో 5 మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన పశ్చిమబెంగాల్ వాసులు కాగా - ఇద్దరు బిహార్ - ఒకరు త్రిపుర వాసిగా పోలీసులు గుర్తించారు.
ఈ కేసు దర్యాప్తు పై సర్వత్రా ఉత్కంఠ నెలకున్న నేపథ్యంలో.. పోస్టుమార్టం రిపోర్టులో ఏముందో అని తెలుసుకోవడం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా వాళ్లంతా ప్రాణాలతో ఉండగానే బావిలో పడినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినట్టు సమాచారం. ఇక వాళ్లంతట వాళ్లే కావాలని బావిలోకి దూకారా? లేదంటే మత్తు - విషంలాంటిది ఇచ్చి బతికి ఉండగానే బావిలో పడేశారా అన్న విషయాలు తేలాల్సి ఉంది. మొత్తంగా పోస్టుమార్టం నివేదిక మరణాల చిక్కుముడిని మరింత బిగించింది.
ఈ కేసులో ముఖ్యంగా ఫోన్ కాల్స్ డిటేల్స్ కీలకంగా భావిస్తున్నారు పోలీసులు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేసరికి పదినుంచి.. పదిహేను రోజుల సమయం పడుతుంది అని తెలుస్తుంది. మక్సూద్ తనయ బుస్రాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్న యాకూబ్ ఫోన్ కాల్స్ తోపాటు.. ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడనే విషయాలపై పోలీసలు ఫోకస్ పెట్టారు. మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు కనిపించకపోవడంతో వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు.