అసలే పేదరికం... ఆపై కరోనాతో చేతిలోని చివరి పైసా కూడా ఖర్చైపోయింది. ఇక కడుపు నిండేదెలా? ఎవరో దాతలు వస్తారు... ఏదో చేస్తారని చూడటం తప్పించి చేసేదేమీ లేదు. నిజమే... ఈ వాదనకు అద్దం పట్టేలా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. బుక్కెడు అన్నం కోసం వలస కూలీలు... ఓ రైల్వే స్టేషన్ లో ఎగబడ్డ తీరు చూస్తే.. కరోనా నేపథ్యంలో ఆకలి ‘భారతం’ ఇలాగే ఉందంటూ ఆ వీడియో చెప్పేసింది. కేవలం అన్నం పొట్లం కోసం పలువురు వలస కూలీలు తోసుకుంటున్న ఈ వీడియో నిజంగానే ఆకలి ‘భారతం’ ఎలా ఉందో ఇట్టే చేప్పేసిందని చెప్పక తప్పదు.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సదరు వీడియోలో ఏముందున్న విషయానికి వస్తే... బీహార్ లోని కతియార్ రైల్వేస్టేషన్ లో చోటుచేసుకున్న ఓ ఘటనను ఈ వీడియోలో చూడొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికో వలస కూలీలతో వెళుతున్న ఓ ప్రత్యేక రైలు అప్పుడే కతియార్ స్టేషన్ లో ఆగింది. ఆ రైలు నుంచి దిగిన ఓ పెద్దాయన దగ్గర కొన్ని ఆహార పొట్లాలు ఉన్నాయి. వాటిని అవసరమైన వారికి పంచుదామని ఆ పెద్దాయన తలస్తే... ఆయన చేతిలో పంపిణీకి సిద్ధంగా ఉన్నది ఆహార పొట్లాలేనని నిర్ధారించేసుకున్న పలువురు వలస కూలీలు.. వాటి కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో వారిలో వారే తోసులాడుకున్నారు. ఈ క్రమంలో పొట్లాలు చేతబట్టుకున్న పెద్దాయన కూడా తూలిపడబోయి ఎలాగోలా తమాయించుకుని నిలబడ్డారు.
పెద్దాయన చేతిలోని ఆహార పొట్లాల కోసం వలస కూలీలు కుస్తీలు పడుతుంటే... అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీనిని మొత్తం వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశారు. ఆ వెంటనే ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. దీనిపై నెటిజన్లు కూడా ఆసక్తికర కామెంట్లు జోడించారు. ‘ఇదీ మన ఆకలి భారతం, హృదయ విదారకం’ అంటూ నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. మొత్తంగా కరోనా నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున సాయం అందుతున్నా కూడా ఇంకా వలస కూలీలు, ఇతర కొన్ని వర్గాల ఆకలి ఏమాత్రం తీరడం లేదనే చెప్పాలి. ఈ పరిస్థితిని మార్చేందుకు మరింత మంది ముందుకు రావాలని, ప్రభుత్వం కూడా మరింత మేర సాయాన్ని చేయాల్సిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.