తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. విమర్శనాస్త్రాలతో నిప్పులు చెరగటం.. నోటికొచ్చినట్లుగా తిట్లు తిట్టటం లాంటివి పాతకాలం నాటి రాజకీయాలు. గురి చూసి కొట్టటం.. సమయం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయటం.. అవకాశం లభిస్తే.. ఏ మాత్రం వదలకుండా ఉక్కిరిబిక్కిరి చేయటం లాంటి కొత్త తరహా టెక్నిక్కులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి.
కొందరి విషయంలో నోటిని వాడేసే కేసీఆర్.. ప్రధాని మోడీ లాంటి బిగ్ షాట్ల విషయంలో మాత్రం మెదడుకు పదును పెడతారు. ఆకాశాన్ని ఎత్తేసేలా పొగిడి నోటితోనే.. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఇరుకున పెడతారు. నోటితో ఒక్క మాట అనకుండా.. చేతల్లో చేసే పనులు మోడీ మాష్టారి ఇమేజ్ ను భారీగా దెబ్బ తీస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.
లాక్ డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన వలస కార్మికుల్ని.. వారి సొంతూళ్లకు పంపే విషయంలో మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఉండటమే కాదు.. తానిచ్చిన వరానికి తగ్గట్లే శ్రామిక్ రైళ్లను నడిపి.. తమ రాష్ట్రానికి వచ్చిన వారిని సొంతూళ్లకు పంపే బాధ్యతను తీసుకున్నారు.
అయితే.. ప్రభుత్వం స్పందించి.. రైళ్లను సమకూర్చే సమయానికే పెద్ద ఎత్తున వలసకార్మికులు వెళ్లిపోగా.. మిగిలిన వారిని అత్యంత జాగ్రత్తగా తరలిస్తున్నారు. ఇప్పటికే లక్షకు పైగా కార్మికుల్ని వారి సొంత రాష్ట్రాలకు తరలించిన కేసీఆర్ దెబ్బకు కేంద్రం ఇప్పుడు డిఫెన్సులో పడిపోయింది. శ్రామిక్ రైళ్ల పేరుతో పట్టాలెక్కించిన రైళ్ల ఛార్జీల మీదా.. కేంద్రం బాదుడు మీద సీఎం కేసీఆర్ ఇప్పటికే తన మాటలతో చెప్పటమే కాదు.. గణాంకాల రూపంలో ఆయన శిష్యులు ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు.
మనసున్న మనిషిగా మాటలుచెప్పే మోడీ మాష్టారు.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా నానా తిప్పలు పడుతున్న వలసకార్మికుల విషయంలో భిన్నంగా వ్యవహరించారని.. లక్షలాది మందిని మండే ఎండల్లో రోడ్ల మీద నడిచేలా చేశారన్న ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తుగా లాక్ డౌన్ విధించి దేశానికి మేలు చేశారన్న ఇమేజ్ కంటే కూడా వలసకార్మికుల విషయంలో కేంద్రం దారుణంగా దెబ్బ తిందన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. తెలంగాణలోని ఏ ఒక్క వలసకార్మికుడు కూడా నడిచి వెళ్లాల్సిన అవసరం లేదని.. వారిని ఇంటికి చేర్చే బాధ్యత తమ ప్రభుత్వానిదన్న మాటను మరోసారి కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క కార్మికుడు తన రాష్ట్రానికి కాలి నడకన వెళ్లే దుస్థితి రాకుండా చూడాలని పేర్కొన్నారు.
వారి సొంతూళ్లకు వెళ్లటానికి రైలు.. బస్సు.. ఇలా ఏది మంచిదైతే దాన్ని ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సొంతూరుకు వెళ్లాలనుకునే వారెవరూ కాలినడకన వెళ్లాలన్న తీవ్ర నిర్ణయాన్ని అస్సలు చేయొద్దని.. వారిని వారి ఊరికి చేర్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్న వరాన్ని తాజాగా ఇచ్చారు.
కేసీఆర్ నోటి నుంచి వచ్చిన తాజా హామీ ప్రధాని మోడీ ఇమేజ్ ను మరింతగా తీస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వమే స్వయంగా తమను రైలు ఎక్కించి ఊరికి పంపించిందన్న పాజిటివ్ ప్రచారం వలస కార్మికుల కారణంగా పెరగటమే కాదు.. జాతీయ స్థాయిలో కేసీఆర్ తన ఇమేజ్ ను భారీగా పెంచుకుంటున్నారని చెప్పాలి.
కేసీఆర్ ఇమేజ్ గ్రాఫ్ ఇలా పెరుగుతుంటే.. మరోవైపు ప్రధాని మోడీ ఇమేజ్ దెబ్బ తింటుందన్నది మర్చిపోకూడదు. వలస కార్మికుల్ని వారి సొంతూళ్లకు పంపే కీలక నిర్ణయాన్ని ప్రధాని మోడీ తీసుకొని.. అమలు చేసి ఉంటే ఆయన ఇమేజ్ గ్రాఫ్ భారీగా పెరిగేదన్న మాట వినిపిస్తోంది. బీజేపీ వ్యూహకర్తలు ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అయినట్లు?