కొత్త టెన్షన్.. ఆ శ్రామిక్ రైల్లో 167 మంది మిస్

Update: 2020-05-15 05:00 GMT
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు.. కార్మికుల్ని తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్ల పేరుతో పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్ లోని సూరత్ నుంచి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు 1340 మంది వలసకార్మికులతో శ్రామిక్ రైల్ బయలుదేరింది.

ఈ రైల్లో ప్రయాణించే వారిలో 167 మంది ప్రయాణికులు మిస్ అయినట్లుగా గుర్తించారు. గమ్యస్థానాలకు చేరినంతనే.. ప్రయాణికుల జాబితాను తనిఖీ చేసిన అధికారులు కంగుతిన్నారు. ప్రయాణికుల్లో 167 మంది మిస్ కావటంతో.. ఇప్పుడు వారంతా ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారన్నది ఇప్పుడు సమస్యగా మారింది.

హరిద్వార్ చేరుకునే సమయానికి ట్రైన్లో 1173 మంది మాత్రమే ఉండటం.. మిగిలిన 167 మంది ఎక్కడున్నారన్న విషయాన్ని అడిగితే.. తమకు తెలీదని చెప్పటంతో.. వారంతా ఎక్కడికి వెళ్లారన్నది ప్రశ్నగా మారింది. తక్కువ వేగంతో రైలు ప్రయాణించే సమయంలో.. క్వారంటైన్ కు భయపడి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.

కనిపించకుండా పోయిన వలసకార్మికులు ఏయే ప్రాంతాల్లో దిగి ఉంటారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వలసకూలీల్ని వారి సొంతూళ్లకు తరలించే క్రమంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైల్లో ఈ తరహా ఉదంతం చోటు చేసుకోవటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా ఉండేందేకు ఏం చేయాలన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News