దేశ రాజధాని వణికింది. ప్రకృతి ప్రకోపంతో.. దేశ రాజధాని చిగురుటాకులా వణికింది. కాకుంటే కొన్ని సెకన్లు మాత్రమే. భూకంప ప్రకంపనలతో దేశ రాజధాని ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్నారు.
అర్థరాత్రి 1.40 గంటలు దాటిన తర్వాత ఢిల్లీలోని భూమి కొన్ని సెకన్లు వణికింది. గాఢ నిద్రలో ఉన్న చాలామందికి ఏమీ తెలీలేదు. ఏదోజరిగిందని ఉలిక్కిపడిన వారు.. ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి కాసేపు పట్టింది. మరికొందరికైతే.. అసలేమీ అర్థం కాని పరిస్థితి. ఇక.. భూప్రకంపనల తీవ్రత పెద్దగా లేకున్నా.. ప్రజల్ని భయపెట్టే స్థాయిలో ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ భూకంప తీవ్రత కారణంగా ఢిల్లీ నగర పరిధిలో ఎవరికీ ఎలాంటి ప్రాణ.. ఆస్తినష్టం వాటిల్లలేదు. ఇక.. భూకంప కేంద్రం దేశ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లుగా నిపుణులు గుర్తించారు. మరిన్ని భూకంప ప్రకంపనలు చోటు చేసుకోవచ్చన్న మాటలు (ఊహాగానాలు) భయాందోళనలకు గురి చేస్తున్నాయి. చూస్తుంటే.. దేశ రాజధాని ప్రజలకు ఈ వీకెండ్ భూకంప టెర్రర్ వెంటాడుతుందన్న మాట వినిపిస్తోంది.