టీడీపీ ఎంపీ మాగంటి బాబు గుండెపోటుకు గురయ్యారు. దీంతో.. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చింతలపూడిలో నిర్వహించిన సైకిల్ యాత్రలో మాగంటి బాబు పాల్గొన్నారు. అలసట అన్నది లేనట్లు హుషారుగా తిరిగే బాబు.. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఇష్టపడతారన్న పేరుంది.
తాజాగా చేపట్టిన సైకిల్ యాత్రలో ఆయన పాల్గొంటున్నారు. ఈ రోజు (శుక్రవారం) చింతలపూడిలో నిర్వహించిన సైకిల్ యాత్రలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా వైద్యులు తేల్చారు.
ఆయనకు పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పటివరకూ హుషారుగా తమతో ఉన్న ఎంపీ.. హటాత్తుగా అనారోగ్యానికి గురి కావటంపై క్యాడర్ షాక్ తిన్న పరిస్థితిలో ఉన్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేయాల్సి ఉంది.