ఈ మధ్య భూప్రకంపనలు తరచూ చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి భూమి స్వల్పంగా వణికింది. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతగా ఉన్న ఈ భూప్రకంపనల కారణంగా జార్ఖండ్.. బీహార్ లోని పలు ప్రాంతాలు కొద్దిసేపు వణికాయి. జార్ఖండ్ లో చోటు చేసుకున్న ఈ ప్రకంపనలు స్వల్పంగా ఉన్నప్పటికీ.. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
జార్ఖండ్ లోని దేవ్ గడ్.. థన్ బాద్.. బిహార్ లోనిగయ.. జముయ్ ప్రాంతాల్లో భూమి వణికింది. దేవ్ గఢ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా భావిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న భూప్రకంపనల కారణంగా.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయి. మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రకంపనలతో జనాలు ఇళ్లల్లో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం ఏమీ లేదని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం రావాల్సి ఉంది.