జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటుడు. ఆయనకు తనను హీరోగా వెండి తెర మీద ఎలా ఎలివేట్ చేసుకోవాలో చాలా బాగా తెలుసు. పవన్ ఇంట్రడక్షన్ సాంగ్ తోనే థియేటర్ అదిరిపోతుంది. ఇపుడు రియల్ లైఫ్ లో పవన్ పొలిటికల్ గా కూడా ఫుల్ ప్యాక్డ్ గా అన్నీ రెడీ చేసుకుని మరీ దిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర అని చెప్పారు. కానీ ఆయన విడుదల చేసిన ఫోటోలు చూస్తే మిలటరీ వ్యాన్ ని పోలిన వాహనం ఉంది. దానికి వారాహి అని పేరు పెట్టారు.
ఇక ఈ వాహనం దూసుకువస్తున్నట్లుగా వెనక పంజాబ్ కి చెందిన జవాన్ల తరహాలో ముగ్గురు ఆ వ్యాన్ ని అనుసరిస్తున్నట్లుగా చూపిస్తూ ఒక వీడియో బైట్ ని పవన్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. వెనక వార్ మూడ్ ని ఎలివేట్ చేసేలా ఒక సౌండ్ ని యాడ్ చేసి వదిలిన ఈ వీడియో బైట్ కేక పుట్టిస్తోంది. ఇక ఈ మిలటరీ వ్యాన్ తో పవన్ యాత్ర ఏపీ అంతటా సాగుతుంది అన్న మాట.
అన్ని రకాల సదుపాయాలతో ఉన్న ఈ మిలటరీ వ్యాన్ పవన్ని ఏపీలో ని అయిదు కోట్ల మందికి డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తుంది. పవన్ ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యాన్ లోనే ఉంటూ తింటూ నిద్రించేలా అన్ని రకాల ఏర్పాట్లు మొత్తం చేసి ఉంచారని తెలుస్తోంది. చూడముచ్చటగా ఉన్న ఈ మిలటరీ వ్యాన్ పైన టాప్ లో మీటింగ్ కోసం పవన్ మాట్లాడేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేశారు. అక్కడ నుంచి పవన్ మాట్లాడుతూ జనాలకు ఉర్రూతలూగిస్తారు అన్న మాట.
దీన్ని చూస్తే అప్పట్లో అంటే 1982లో అన్న ఎన్టీయార్ ఉమ్మడి ఏపీ అంతా కలియతిరిగేందుకు చైతన్య రధాన్ని తయారు చేయించుకున్నారు. మళ్ళీ అదే ఇపుడు జ్ఞాపకం వస్తోంది. సరిగ్గా నాలుగు దశాబ్దాలు అయింది. నాడు నేడూ కూడా ఇద్దరూ టాప్ సినీ స్టార్లే. ఇద్దరికీ అద్భుతమైన జనాల మద్దతు ఉంది. ఇద్దరి చరిష్మా కూడా నింగిని అంటే విధంగా ఉంటుంది.
ఇద్దరి ఆశయాలూ ఒక్కటే. నిజాయితీగా రాజకీయాలు నడపడం, అవినీతి లేని పాలనను తీసుకురావడం, సరికొత్త రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేయడం, నాడు ఎన్టీయార్ ఎన్నికలకు ముందు తొమ్మిది నెలల పాటు అవిశ్రాంతంగా ఏపీ అంతా తిరిగారు. చైతన్య రధంలోనే బస చేశారు. ఆరు బయట నిద్రించారు. ఇపుడు పవన్ తయారు చేసుకున్న వాహనం చూస్తే స్నానాలు సైతం అందులోనే హ్యాపీగా చేసే వీలుందని అంటున్నారు. పవన్ అసలు బయటకు రాకుండా సర్వ సదుపాయాలు సమకూర్చారు అని అంటున్నారు.
అందులోనే పార్టీ నాయకులతో మీటింగులు ఏర్పాటు చేసుకోవడానికి మినీ కాన్ఫరెన్స్ హాల్ తో పాటు, పవన్ విశ్రమించడానికి చక్కని ఆధునిక వసతితో కూడా గదిని కూడా ఉంచారని అంటున్నారు. పవన్ నేరుగా వ్యాన్ లో నుంచి తన రూం నుంచి టాప్ ఎక్కి మరీ ప్రసంగం చేసేందుకు వీలుగా నిచ్చెన వంటి ఏర్పాట్లు ఇన్నర్ గానే చేశారు అని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే పవన్ అసలు బయటకే రాకుండా ఆ వ్యాన్ లో అంతా గడపవచ్చు. ఆయన మీటింగుకి డైరెక్ట్ గా హాజరై మళ్లీ విశ్రాంతి తీసుకోవచ్చు.
ఇక పవన్ చుట్టూ రక్షణ వలయంగా బౌన్సర్లు ఎటూ ఉంటారు. ఇపుడు పంజాబ్ నుంచి రప్పించినట్లుగా ఉన్న మిలటరీ స్టాఫ్ ని పోలిన సెక్యూరిటీ కూడా ఆ వాహనాన్ని అనుసరిస్తూ పవన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే రాజు వెడలె రవి రేజములు అలరగా అన్నట్లుగా పవన్ వెడలె సమరానికి సర్వ సైన్యాం తరలిరాగా అని చెప్పుకోవాలి. మొత్తానికి పవన్ ని చూసేందుకు ఎలాగో జనాలు ఎగబడతారు. ఇపుడు ఆయన వాహనాన్ని కూడా చూసేందుకు ఇంతకు రెట్టింపు వస్తారు. పవన్ గ్లామర్ కి ఈ వాహనం తోడు అయితే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుగానే ఏపీలో పొలిటికల్ సీన్ ఉంటుంది అనుకోవాలి. టోటల్ గా చూస్తే సేనానీ రెడీ అనే చెప్పాలి.
Full View
Full View Full View

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.