ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్.. గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేడు. తొలుత చెన్నైను కట్టడి చేసినట్లే కనిపించిన గుజరాత్.. చివరకు 169 పరుగుల స్కోరిచ్చింది. అటు చూస్తే గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ కు మూలస్తంభమైన ఓపెనర్ శుబ్ మన్ గిల్ డకౌటయ్యాడు. తప్పనిసరయిన పరిస్థితుల్లో తీసుకుని ఓపెనింగ్ పంపిన సాహా పెద్దగా ఉపయోగపడలేదు. వన్ డౌన్ లో వస్తున్న విజయ్ శంకర్ పై అశలు ఆశలే లేవు. అభినవ్ మనోహర్ అనే కొత్త కుర్రాడు రాణిస్తున్నా.. ఛేజింగ్ లో తీవ్ర ఒత్తడిలో ఆడలేకపొయాడు. ఇక మిగిలింది దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్. కాస్తకూస్తో బ్యాట్ ఝళిపించగల రషీద్ ఖాన్ మాత్రమే. అసలు ఇది ఒక ఫ్రాంచైజీ బ్యాటింగ్ ఆర్డరేనా.. ? అన్నట్లుంది. కానీ, గుజరాత్ అద్భుతమే చేసింది. టోర్నీలో ఐదో విజయం సాధించి పది పాయింట్లతో టాపర్ గా నిలిచింది.
ఆశలు లేకున్నా
ఏ కారణంతో అయితేనేమి..? టోర్నీలో అసలు ఆశలు లేని జట్టు గుజరాత్ టైటాన్స్. బ్యాటింగ్ లో గిల్ ఒక్కడే నిఖార్సయిన ఆటగాడు. హార్దిక్ ఆల్ రౌండర్. అయినా కొంతకాలంగా ఫామ్ లో లేడు. గాయాలూ వేధిస్తున్నాయి. మిల్లర్ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ . ఎప్పుడో నాలుగైదేళ్ల కిందట అతడి మెరుపులు కనిపించాయి. ఇటీవల లేనే లేవు. బౌలింగ్ లో షమి, రషీద్ తప్ప మిగతావారు నామమాత్రమే. కానీ గుజరాత్ అద్భుతాలు చేస్తోంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్ ల్లో ఓడి గెలుపు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తుంటే గుజరాత్ మాత్రం ఆరు మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో ఔరా అనిపిస్తోంది. దిగ్గజాలు లేకున్నా సమష్టిగా ఆడుతూ నెగ్గుకొస్తోంది.
మిల్లర్ ఇన్నింగ్స్ మామాలు కాదు..
అసలే బ్యాట్స్ మన్ లేరంటే.. 170 పరుగుల ఛేదనలో 48 పరుగులకే నాలుగు వికెట్లు.. 87 పరుగులకు 5 వికెట్లు.. ఇదీ చెన్నైతో మ్యాచ్ లో ఆదివారం గుజరాత్ పరిస్థితి. కానీ, ఇలాంటి స్థితిలోనూ మిల్లర్ చెలరేగి ఆడి విజయం అందించాడు. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న జట్టును గెలిపించాడు. గిల్ (0), విజయ్ శంకర్ (0), అభినవ్ మనోహర్ (12) విఫలమైనా తాను ఒంటి చేత్తో బయటపడేశాడు. లక్ష్యం పెరిగిన స్థితిలో ధాటిగా బ్యాటింగ్ చేస్తూ మిల్లర్ పరిస్థితిని చక్కదిద్దాడు. ఓ దశలో ఏడు ఓవర్లకు స్కోరు 45/3.
తర్వాతి ఓవర్లో సాహాను జడేజా వెనక్కి పంపినా.. మిల్లర్ అదిరే బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అలీ ఓవర్లో సిక్స్, జడేజా ఓవర్లో వరుసగా 6, 6, 4తో గుజరాత్‌ను గట్టిగా పోటీలో నిలిపాడు. మిల్లర్ 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే రాహుల్ తెవాతియా (6)ను బ్రావో త్వరగా వెనక్కి పంపాడు. మరోవైపు రషీద్ ఖాన్ నిలిచినా వేగం తగ్గడంతో గుజరాత్ 17 ఓవర్లలో 122/5తో నిలిచింది. చివరి 3 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు విజయం కష్టమే అనిపించింది. కానీ అక్కడి నుంచే సునామీ మొదలైంది.
గేర్ మార్చిన రషీద్ పెను విధ్వంసంతో మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. అతడు తన విలక్షణ బ్యాటింగ్‌తో మూడు సిక్స్‌లు, ఫోర్ బాదడంతో జోర్డాన్ ఒక్క ఓవర్లోనే 25 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ తర్వాతి ఓవర్లో అతడితో పాటు జోసెఫ్‌ను ఔట్ చేసి 10 పరుగులు ఇచ్చిన బ్రావో మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాడు. నెగ్గాలంటే చివరి ఓవర్లో గుజరాత్ 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి. తొలి రెండు బంతులకు పరుగులేమీ రాకపోవడంతో ఉత్కంఠ పెరిగింది.
కానీ మూడో బంతికి మిల్లర్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. తర్వాతి బంతికి మిల్లర్ క్యాచ్ ఔట్ కావడంతో చెన్నై సంబరపడింది. కానీ బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో అది నోబాల్ అయింది. తర్వాతి బంతికి ఫోర్ కొట్టిన మిల్లర్.. వెంటనే 2 పరుగులు తీసి గుజరాత్‌కు విజయాన్నందించాడు. 32 ఏళ్ల మిల్లర్ గురువారం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లోనూ 14 బంతుల్లో 31 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ పరుగులే జట్టు గెలుపు మార్జిన్ ను నిర్దేశించాయి. చూస్తుంటే.. మంచి ఫామ్ తో ఈ సారి టోర్నీలో మిల్లర్ కీలకంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.