కేసీఆర్-గవర్నర్ ఫైట్ లోకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్

Update: 2022-04-23 07:30 GMT
తెలంగాణ గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపాయి. కేసీఆర్ సర్కార్ తనను పట్టించుకోకపోవడంపై ఢిల్లీ వెళ్లి మరీ కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేసింది గవర్నర్. అనంతరం కేసీఆర్ పై విరుచుకుపడింది. దీనికి టీఆర్ఎస్ మంత్రులు కౌంటర్లతో విరుచుకుపడ్డారు.

గవర్నర్ వైఖరి తెలంగాణ సర్కార్ పుండుపై కారం చల్లినట్టుగా ఉంది. మరోవైపు గవర్నర్ పరిధి దాటి నడుచుకుంటున్నారని మంత్రులు విమర్శలకు పదును పెట్టారు. రాజకీయనాయకుల్లా ఆమె విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి చేయడం కష్టమని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

తాజాగా కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ తమిళిసై ఫైట్ లోకి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తలదూర్చారు.

ఆయన మరో వివాదాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తన పీఆర్వోగా బీజేపీ సభ్యుడిని గవర్నర్ నియమించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

గవర్నర్ చర్య చాలా అక్రమమని అసదుద్దీన్ దుయ్యబట్టారు. ఆయన మరో వివాదాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు అసుద్దీన్ ట్వీట్ చేశారు. 'గవర్నర్ పీఆర్వోగా బీజేపీ సభ్యుడిని నియమించుకోవడం పెద్ద తప్పు' అని అసద్ విమర్శించారు. ఇది చాలా అక్రమం అన్నారు.

ఈ నియామకంతో తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఢీ అంటే ఢీ అని గవర్నర్ చేస్తున్న ఫైట్ కు ఇది అనుమానంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలోనే పీఆర్వో నియామకంపై వెల్లడైన అనుమానాలపై గవర్నర్ స్పందన ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
Tags:    

Similar News